News March 1, 2025

మంచు కొండలు విరిగిపడిన ఘటన.. నలుగురు మృతి

image

ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌లో మంచు కొండలు విరిగిపడిన ఘటనలో నలుగురు మరణించారు. నిన్న మంచుచరియల కింద వీరు చిక్కుకోగా రెస్క్యూ సిబ్బంది వెలికితీసి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో ఆరుగురి కోసం ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. మొత్తం 57 మంది చిక్కుకోగా 47 మందిని ఆర్మీ రక్షించింది.

Similar News

News March 1, 2025

ఇసుక సరఫరాపై సీఎం ఆదేశాలు

image

TG: ఇసుక, ఖనిజాల అక్రమ తవ్వకాలపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఖనిజాభివృద్ధి శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టే పనులకు TGMDC నుంచే ఇసుక సరఫరా చేయాలన్నారు. పెద్దమొత్తంలో చేపట్టే నిర్మాణ రంగాలకు వీటి నుంచి సరఫరా చేయాలని సూచించారు. ప్రభుత్వమే సరైన ధరలకు సరఫరా చేస్తే అక్రమాలకు ఆస్కారం ఉండదని స్పష్టం చేశారు.

News March 1, 2025

వీల్లేంట్రా బాబు.. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నారు!

image

హోటల్‌కు వచ్చిన వారిలో కొందరు రూమ్స్‌లోని వస్తువులను దొంగిలిస్తుండటంతో దీనికి అడ్డుకట్ట వేసేందుకు సదరు యాజమాన్యం వినూత్నంగా ఆలోచించింది. ముంబైలోని ఓ హోటల్ రూమ్స్‌లో ఉన్న బాత్రూమ్ స్లిప్పర్స్ కూడా దొంగతనానికి గురయ్యాయి. దీంతో ఒకే సైజులోని వేర్వేరు చెప్పులను జోడీగా ఉంచారు. ఓ వ్యక్తి దీనిని ఫొటో తీసి Xలో షేర్ చేయడంతో వైరలవుతోంది. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నారేంట్రా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News March 1, 2025

దేశానికి రోల్ మోడల్‌లా పోలీస్ స్కూల్: సీఎం

image

TG: యంగ్ ఇండియా పోలీస్ స్కూలులో పోలీస్ అమరుల కుటుంబాల పిల్లలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశించారు. HYD మంచిరేవులలోని గ్రేహౌండ్స్ క్యాంపస్ సమీపంలోని ఈ స్కూలులో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. సైనిక్ స్కూల్ తరహాలో పోలీస్ స్కూల్‌ను దేశానికి రోల్ మాడల్‌గా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. స్కూల్ <>వెబ్‌సైట్‌ను<<>> లాంచ్ చేశారు.

error: Content is protected !!