News April 29, 2024

ఇన్ని పరుగులా.. మజా లేదు!

image

స్వీట్ అనేది అప్పుడప్పుడు తింటేనే బాగుంటుంది. రోజంతా స్వీటే తినాలంటే ఎవరికైనా బోరే. క్రికెట్‌లో పరుగులైనా అంతే. ఈ ఏడాది ఐపీఎల్‌‌లో బ్యాట్స్‌మన్ అలవోకగా సిక్సులు బాదేస్తుంటే బౌలర్లు చేష్టలుడిగి చూస్తున్నారు. కఠిన పరిస్థితుల్లో బ్యాటర్ తన నైపుణ్యంతో పైచేయి సాధిస్తే వేరు. కానీ బౌలర్ ఎవరైనా ఊచకోతే అంటే మజా ఏది? ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనా? చిన్న బౌండరీలా? బ్యాటర్ల నైపుణ్యమా? కారణం ఏం అనుకుంటున్నారు?

Similar News

News January 14, 2026

CEERIలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

<>CSIR-<<>>సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ (CEERI)లో 7ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి MSc (ఎలక్ట్రానిక్స్/ఫిజిక్స్/ అప్లైడ్ ఫిజిక్స్/అప్లైడ్ ఎలక్ట్రానిక్స్), BE/BTech, ME/MTech, సంబంధిత డిగ్రీ, టెన్త్+డిప్లొమా (MLT/DMLT) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: www.ceeri.res.in

News January 14, 2026

విమానాలకు ‘పొగ’బెట్టిన భోగి

image

చెన్నైలో భోగి పండుగ విమాన రాకపోకలకు అంతరాయం కలిగిస్తోంది. పొగమంచుకు తోడు భోగి మంటలతో వచ్చిన పొగతో పూర్ విజిబిలిటీ ఏర్పడింది. దీంతో చెన్నై ఎయిర్‌పోర్టులో విమానాలు ల్యాండ్ కాలేకపోతున్నాయి. వాటిని డైవర్ట్ చేస్తున్నారు. అయితే సమయం గడిచేకొద్దీ విజిబిలిటీ పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా ప్రజలు ప్లాస్టిక్, రబ్బర్ టైర్లు కాల్చకుండా స్మోక్ ఫ్రీ సెలబ్రేషన్స్ చేసుకోవాలని TNPCB కోరింది.

News January 14, 2026

తెలుగు ప్రజలకు మోదీ సంక్రాంతి శుభాకాంక్షలు

image

సంక్రాంతి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ సంక్రాంతి మీ జీవితాల్లో సరికొత్త ఆశయాలు, ఉన్నత లక్ష్యాలను నింపాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా ఈ పండుగ మన అన్నదాతలది. నిరంతరం శ్రమిస్తూ దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు కృతజ్ఞతలు తెలిపే పవిత్ర సమయం. ఈ సందర్భంగా సమాజంలో శాంతి, సామరస్యాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నా’ అని Xలో పోస్ట్ చేశారు.