News February 2, 2025
SO SAD.. దక్షిణాఫ్రికాకు మరోసారి హార్ట్ బ్రేక్
అంతర్జాతీయ టోర్నమెంట్లలో దక్షిణాఫ్రికాకు అస్సలు కలిసి రావడం లేదు. ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్స్‌లో విజయం వారికి మరోసారి అందని ద్రాక్షగానే మిగిలింది. తాజాగా U19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ చేతిలో పరాజయం పాలైంది. దీంతో ఆ జట్టు ప్లేయర్లు కన్నీరుపెట్టుకున్నారు. ఏడాది వ్యవధిలోనే సీనియర్స్ మహిళల, పురుషుల T20 WC ఫైనల్స్‌లోనూ ఓడిపోయిన సంగతి తెలిసిందే. మరి WTC ఫైనల్లోనైనా గెలుస్తుందేమో చూడాలి.
Similar News
News February 2, 2025
ట్యాంక్ బండ్‌పై కాంగ్రెస్ శ్రేణుల నిరసన
HYD ట్యాంక్ బండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగాయి. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, బీజేపీ రాష్ట్రంపై వివక్ష చూపిందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వయసులో చిన్నదైన రాష్ట్రానికి సరిగ్గా నిధుల కేటాయింపు జరగలేదని మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
News February 2, 2025
కుంభమేళా తొక్కిసలాటలో కుట్ర కోణంపై దర్యాప్తు
గత నెల 29న మహా కుంభమేళాలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 30మంది మృతిచెందగా 60మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో కుట్రకోణం దిశలో యూపీ సర్కారు దర్యాప్తు చేయిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే 16వేలకు పైగా ఫోన్ నంబర్ల డేటాను అధికారులు విశ్లేషించారని, సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక ఘటనపై దర్యాప్తుకోసం సర్కారు ఇప్పటికే త్రిసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
News February 2, 2025
నా అవార్డు మా నాన్నకు అంకితం: గొంగడి త్రిష
భారత్ అండర్-19 టీ20 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన తెలుగమ్మాయి గొంగడి త్రిష ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ పురస్కారాన్ని తన తండ్రికి అంకితమిచ్చారు. ‘నన్ను ప్రోత్సహించిన అందరికీ ధన్యవాదాలు. మాజీ ప్లేయర్ మిథాలీరాజ్ నాకు ఆదర్శం. అండర్-19 వరల్డ్ కప్ భారత్‌ను వదిలి వెళ్లకూడదని అనుకున్నాను. నా బలాలపైనే దృష్టి పెట్టి ఆడాను. దేశానికి మరిన్ని మ్యాచులు ఆడి గెలవాలన్నది నా లక్ష్యం’ అని తెలిపారు.