News December 11, 2024

అక్కడ అలా.. ఇక్కడ ఇలా!

image

ప్రయాణికులు లేకున్నా విద్యార్థి చదువు కోసం రైలును కొనసాగించిన ఘటన జపాన్‌లో జరిగింది. హక్కైడోలో క్యుషిరటాకి అనే రైల్వే స్టేషన్‌లో కనా హరాడా అనే విద్యార్థి మాత్రమే రోజూ ప్రయాణించేది. రైలు ఆపితే ఆమె చదువుకు ఆటంకం కలుగుతుందని డిగ్రీ పూర్తయ్యేవరకూ ట్రైన్ కొనసాగించారు. అదే మన దగ్గర వరంగల్ జిల్లా నెక్కొండలో ప్రయాణికులు లేకుంటే రైలు నిలుపరని, ప్రజలే చందాలు వేసుకుని రోజూ టికెట్స్ కొంటున్నారు.

Similar News

News October 14, 2025

ఇది శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతిపాత్రమైన కాలం!

image

ప్రతి ఏడాది ఆశ్వయుజ పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకు ‘దామోదర మాసం’గా పరిగణిస్తారు. ఇది శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కాలమని భాగవతంలో ఉంది. ద్వాపర యుగంలో ఈ సమయంలోనే యశోదమ్మ చిన్ని కృష్ణుణ్ని రోలుకు కట్టేసిన లీల జరిగింది. ఈ క్రమంలో దామమును(తాడును), ఉదరానికి కట్టడం వల్ల ఆయన దామోదరుడు అయ్యాడు. ఈ పవిత్ర మాసంలో ఆయనను ‘దామోదర’ అనే నామంతో ఆరాధిస్తే అంతా శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

News October 14, 2025

SBIలో 63 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

SBIలో 63 మేనేజర్(క్రెడిట్ అనలిస్ట్) పోస్టులకు అప్లై చేయడానికి రేపటి వరకే అవకాశం ఉంది. పోస్టును బట్టి డిగ్రీ లేదా MBA/ PGDBA/ PGDBM/ CA/ ICWA/CFA, B.E/B.Tech/MCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 25-35 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు ₹750, SC, ST, PwBD ఫీజు లేదు. షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sbi.bank.in/

News October 14, 2025

1,743 పోస్టులు.. ఎగ్జామ్ డేట్ ఇదే

image

TG: అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(APP) పరీక్ష డిసెంబర్ 14న నిర్వహించనున్నట్లు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. ఎగ్జామ్ 2 షిఫ్టుల్లో జరుగుతుంది. ఉ.10 నుంచి మ. ఒంటిగంట వరకు మల్టిపుల్ ఛాయిస్, మ.2.30 నుంచి సా.5.30 గంటల వరకు డిస్క్రిప్టివ్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 1,743 పోస్టులకు 3,132 అప్లికేషన్లు వచ్చిన విషయం తెలిసిందే.
* ప్రతిరోజూ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.