News August 9, 2024
కాబోయే భర్త చైతూతో దిగిన ఫొటోలు షేర్ చేసిన శోభిత

అక్కినేని నాగచైతన్యతో నిశ్చితార్థం జరిగాక తొలిసారి హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కాబోయే భర్తతో దిగిన ఫొటోలను పంచుకున్నారు. చైతూతో ఫొటో దిగుతూ ఆమె మురిసిపోయారు. ‘కురుంతోగై’లోని A K రామానుజన్ రాసిన కొటేషన్‌ను షేర్ చేశారు. కాగా ఇరువురి కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగినట్లు సినీవర్గాలు తెలిపాయి.
Similar News
News January 27, 2026
నిధుల దుర్వినియోగాన్ని గుర్తించిన కేంద్ర బృందం

TG: సింగరేణి కంపెనీలో CSR నిధులు దుర్వినియోగం అయినట్లు బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారుల బృందం గుర్తించింది. మెస్సీ ఫుట్‌బాల్ ఈవెంట్, రాజీవ్ అభయ హస్తం పథకం సహా కొన్ని ఇతర అంశాలకూ ఈ నిధులు వినియోగించినట్లు కనుగొంది. అలాగే నైనీ బొగ్గు టెండర్ల డాక్యుమెంట్లను లోతుగా విశ్లేషణ చేసింది. వీటిపై తన పరిశీలనలో తేలిన అంశాలతో నివేదికను కేంద్రానికి సమర్పించనుంది. గత వారం బృందం HYD వచ్చి విచారించడం తెలిసిందే.
News January 27, 2026
ఇంటర్వ్యూతో ESIC ఫరీదాబాద్‌లో 50 పోస్టులు

<
News January 27, 2026
ఒకే రోజు రూ.63 కోట్ల కలెక్షన్లు

సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘బార్డర్-2’ భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. నిన్న ఒక్క రోజే ఈ మూవీకి రూ.63 కోట్ల కలెక్షన్లు వచ్చాయని మేకర్స్ తెలిపారు. మొత్తంగా నాలుగు రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.193.48 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టిందని పేర్కొన్నారు. అనురాగ్ సింగ్ తెరకెక్కించిన ఈ మూవీలో వరుణ్ ధవన్, దిల్జీత్ దోసాంజ్ కీలక పాత్రలు పోషించారు.


