News March 28, 2025
సోషల్ మీడియా బజ్: RCBని డామినేట్ చేసిన CSK

ఇవాళ రాత్రి జరిగే RCBvsCSK హైఓల్టేజ్ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సోషల్ మీడియాలో రెండు జట్ల అభిమానులు పోస్టులతో హోరెత్తిస్తున్నారు. గత 24 గంటల్లో చెన్నైకి అనుకూలంగా 52%, బెంగళూరుకు 48% మంది మద్దతుగా నిలిచారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను స్టార్ స్పోర్ట్స్ SMలో విడుదల చేసింది. ఏది ఏమైనా చివరికి మ్యాచ్‌లో తమదే విజయమని ఇరు టీమ్స్ ఫ్యాన్స్ పేర్కొంటున్నారు.
ఇవాళ ఎవరు గెలుస్తారు? మీ కామెంట్.
Similar News
News March 31, 2025
నా కొడుకు ఎవరినీ మోసం చేయలేదు: దర్శకుడి తల్లి ఆవేదన

‘L2:ఎంపురాన్’ మూవీలోని సన్నివేశాలు వివాదానికి దారి తీయడంపై దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి మల్లిక స్పందించారు. ఈ సినిమా విషయంలో పృథ్వీరాజ్‌ను అనవసరంగా నిందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకును బలిపశువును చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. పృథ్వీరాజ్ ఎవ్వరినీ మోసం చేయలేదని, చేయబోరని చెప్పారు. సినిమా స్క్రిప్ట్ విషయంలో తప్పులుంటే అందరి బాధ్యత ఉంటుందన్నారు.
News March 31, 2025
ఆదిలాబాద్ గిరిజన మహిళలకు PM ప్రశంస

TG: ఆదిలాబాద్ జిల్లా గిరిజన మహిళలను ప్రధాని మోదీ ప్రశంసించారు. వాళ్లు తయారు చేస్తున్న ఇప్పపువ్వు లడ్డూల గురించి మోదీ ‘మన్ కీ బాత్’లో ప్రస్తావించారు. మహిళలు కొత్త ప్రయోగం చేశారని అభినందించారు. కాగా అటవీ ప్రాంతాల్లో దొరికే ఇప్పపువ్వుతో గతంలో నాటుసారా తయారుచేసేవారు. అయితే ఉట్నూరుకు చెందిన కొందరు మహిళలు ఇప్పపువ్వుతో పోషక విలువలు కలిగిన లడ్డూలను తయారుచేస్తూ, గిరిజన పాఠశాలలకు పంపిణీ చేస్తున్నారు.
News March 31, 2025
BREAKING: రేపు సెలవు ప్రకటన

AP: రాష్ట్రవ్యాప్తంగా రేపు ఆప్షనల్ హాలిడే (ఐచ్ఛిక సెలవు) ఇస్తూ సీఎస్ కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. వక్ఫ్ బోర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి నివేదిక మేరకు రంజాన్ పర్వదినం అనంతరం రోజైన ఏప్రిల్ 1ని ఐచ్ఛిక సెలవు దినంగా పేర్కొన్నారు. అటు తెలంగాణలో రేపు పబ్లిక్ హాలిడే ఉంది.