News September 2, 2024

వరద బాధితులకు సోషల్ మీడియా సాయం!

image

భారీ వర్షాలకు వరద ముంచెత్తడంతో ముంపు ప్రాంతాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఎవరికి ఫోన్ చేయాలో, తాము ప్రమాదంలో ఉన్నామని ఎలా తెలియజేయాలో తెలియక చాలా మంది భయబ్రాంతులకు గురయ్యారు. కానీ వారందరి పరిస్థితిని అధికారులకు సోషల్ మీడియా తెలియజేసింది. బాధితులు సోషల్ మీడియాలో పోస్టులు చేయడంతో NDRF, స్థానికులు ఎంతో మందిని కాపాడగలిగారు. దీంతోపాటు వారికి ఫోన్ చేసి పరిస్థితులను తెలుసుకుంటూ ఆహారాన్ని అందించారు.

Similar News

News December 5, 2025

ఉమ్మడి జిల్లా HMలతో ITDA ఇన్‌ఛార్జ్ PO సమావేశం

image

మెనూ అమలు బాధ్యత HMలదేనని ITDA ఇన్‌ఛార్జ్ PO యువరాజ్ మార్మాట్ అన్నారు. శుక్రవారం ఉమ్మడి జిల్లాల ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల HMలు, సంక్షేమ అధికారులు, డిప్యూటీ వార్డెన్లతో ఉట్నూర్‌లో సమావేశం శుక్రవారం నిర్వహించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, నూతన మెనూ అమలులో చిన్నపాటి ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News December 5, 2025

TG న్యూస్ రౌండప్

image

* కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్‌పై అభిప్రాయాలు సేకరించేందుకు రేపు తెలంగాణ భవన్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. దీనికి KTR హాజరవుతారు: బోయినపల్లి వినోద్
* కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఇన్‌ఛార్జ్ VCగా డా.రమేష్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది.
* HYD శామీర్‌పేటలో ఓ కారు టైర్లు, సీట్ల కింద ₹4Cr నగదును పోలీసులు గుర్తించారు. హవాలా ముఠాను అరెస్టు చేసి విచారిస్తున్నారు.

News December 5, 2025

గాంధీ చూపిన మార్గమే స్ఫూర్తి: పుతిన్

image

భారత్-రష్యా బలమైన బంధానికి గాంధీ చూపిన అహింసా మార్గమే స్ఫూర్తి అని రాజ్‌ఘాట్ సందర్శకుల పుస్తకంలో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ రాసుకొచ్చారు. శాంతి, అభివృద్ధికి ఆయన చూపిన మార్గం భవిష్యత్తు తరాలను ఇన్‌స్పైర్ చేస్తూనే ఉంటుందన్నారు. జీవితాన్ని భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి అంకితం చేశారని, అహింసకు చిహ్నంగా మారారని రాశారు. ద్వైపాక్షిక వాణిజ్యం, దౌత్య సంబంధాలపై చర్చించడానికి పుతిన్ భారత పర్యటనకు వచ్చారు.