News November 9, 2024
సోషల్ మీడియా వారియర్లను అన్యాయంగా అరెస్టు చేస్తున్నారు: జగన్

చంద్రబాబు తప్పులను నిలదీస్తున్న యువతను చట్టవిరుద్ధంగా, అన్యాయంగా అరెస్టు చేస్తున్నారని YS జగన్ ట్వీట్ చేశారు. ‘చంద్రబాబు చేతిలోనే దాదాపుగా అన్ని పేపర్లు ఉన్నాయి. ప్రజాసమస్యలపై గొంతు విప్పే టీవీలను దెబ్బతీశారు. ఆయనకు కొరుకుడుపడనిది సోషల్ మీడియా ఒక్కటే. పోలీసులను వాడుకుంటూ YCP కార్యకర్తలను హింసిస్తున్నారు. ఫేక్ పోస్టులు చేసిన టీడీపీ అఫీషియల్ అకౌంట్పై చర్యలు తీసుకున్నారా?’ అని ప్రశ్నించారు.
Similar News
News January 23, 2026
కాకినాడ: దంపతులు ఆత్మహత్యాయత్నం

పిఠాపురం(M) మల్లం గ్రామంలో దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంక్రాంతికి పుట్టింటికి వెళ్లేముందు ఓ వివాహిత తన డ్వాక్రా డబ్బులను భర్తకు ఇచ్చింది. తిరిగి వచ్చాక ఆ డబ్బులు అడగగా, ఖర్చయిపోయాయని భర్త చెప్పడంతో మనస్తాపానికి గురైన ఆమె పురుగుల మందు తాగింది. వెంటనే భర్త కూడా అదే మందు తాగాడు. గమనించిన స్థానికులు ఇద్దరినీ కాకినాడ ఆస్పత్రికి తరలించారు.
News January 23, 2026
రెండు వారాల్లో గ్రీన్లాండ్పై క్లారిటీ: ట్రంప్

గ్రీన్లాండ్ డీల్ విషయంలో పురోగతి కనిపిస్తోందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి దానికి సంబంధించిన వ్యవహారాలు సజావుగా సాగుతున్నాయని.. మరో 2 వారాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. గతకొన్ని వారాలుగా గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటామంటూ ఆయన హెచ్చరిస్తున్న నేపథ్యంలో తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఓ దశలో సైనిక చర్యకూ వెనకాడబోమని హెచ్చరించినప్పటికీ తర్వాత వెనక్కి తగ్గారు.
News January 23, 2026
రేషన్ బియ్యంతోపాటు నిత్యావసరాలు: ఉత్తమ్

TG: రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభవార్త చెప్పారు. రేషన్ బియ్యంతోపాటు ఇతర నిత్యావసర సరుకులు అందించేందుకు యోచిస్తున్నామని తెలిపారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఇచ్చినట్లుగానే నిత్యావసరాలు కూడా ఇచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. మరోవైపు 2025-26 వానాకాలం సీజన్లో 71.70 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి.. రైతుల ఖాతాల్లో రూ.18వేల కోట్లు జమ చేసినట్లు తెలిపారు.


