News September 8, 2024

అలాంటి వారిని సమాజం స్వీకరించదు: అజిత్ పవార్

image

కుటుంబంలో విభేదాలు సృష్టించేవారిని సమాజం ఇష్టపడదని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి ధర్మేంద్ర బాబాపై ఆయన కూతురు భాగ్యశ్రీ(NCP శరద్ వర్గం) పోటీ చేస్తారనే ప్రచారంపై అజిత్ స్పందించారు. కూతురు కన్నా తండ్రిని ఎక్కువగా ఎవరూ ప్రేమించలేరని, తండ్రిపైనే పోటీ సరికాదని హితవు పలికారు. కాగా శరద్ పవార్‌తో తెగదెంపులు చేసుకొని షిండేతో అజిత్ పవార్ పొత్తు కలిసిన సంగతి తెలిసిందే.

Similar News

News August 19, 2025

50 ఏళ్లనాటి రూల్స్‌తో సినిమాలు తీయలేం: SKN

image

సినీ కార్మికులకు వేతనాలు పెంచేందుకు చిన్న నిర్మాతలు అంగీకరించడం లేదని ప్రొడ్యూసర్ SKN తెలిపారు. 50 ఏళ్ల నాటి రూల్స్‌తో ఇప్పుడు సినిమాలు నిర్మించడం కష్టమని ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘కార్మికులు రోజుకు రూ.2 వేల కంటే ఎక్కువగా వేతనాలు తీసుకుంటున్నారు. ఇతర ఇండస్ట్రీల్లో చెల్లిస్తున్న వేతనాల కంటే ఇది చాలా ఎక్కువ. కార్మికులు ఇలాగే నిబంధనలు విధిస్తే ఇతర భాషల మేకర్స్ ఇక్కడికి రాలేరు’ అని పేర్కొన్నారు.

News August 19, 2025

భారత్-పాక్‌ యుద్ధాన్ని నేనే ఆపా: ట్రంప్

image

ఆరు నెలల్లోనే తాను 6 యుద్ధాలు ఆపినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఇందులో భారత్-పాక్ యుద్ధం కూడా ఉన్నట్లు ఆయన మరోసారి చెప్పారు. జెలెన్‌స్కీతో భేటీ సందర్భంగా ఆయన వైట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. ‘రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేను కానీ ఖచ్చితంగా ముగుస్తుంది. 31 ఏళ్లుగా జరుగుతున్న రువాండా-కాంగో యుద్ధాన్ని ఆపా. అలాగే ఈ యుద్ధాన్ని కూడా నిలువరిస్తా’ అని చెప్పుకొచ్చారు.

News August 19, 2025

మహిళలకు ఫ్రీ బస్‌.. సీఎం మరో గుడ్‌న్యూస్

image

AP: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆధార్ జిరాక్స్‌తో పాటు సాఫ్ట్ కాపీని కూడా అనుమతించాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ‘స్త్రీశక్తి’ పథకంపై సమీక్ష నిర్వహించారు. సోమవారం ఒక్కరోజే 18 లక్షల మందికిపైగా మహిళలు జీరో ఫేర్ టికెట్‌తో ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించినట్లు అధికారులు ఆయన తెలిపారు. దీంతో వారికి రూ.7 కోట్లకు పైగా ఆదా అయిందన్నారు. అటు ఘాట్ రోడ్లలోనూ పథకం అమలు చేయాలని సీఎం సూచించారు.