News March 25, 2025

50 ఏళ్లకే వృద్ధులవుతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు: కూనంనేని

image

TG: అసెంబ్లీలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు 50 ఏళ్లకే వృద్ధులవుతున్నారని ఆయన అన్నారు. వీరికి కార్మిక చట్టాలు అమలవుతాయా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శ్రమ, మేధ దోపిడీ ఇక్కడే జరుగుతోందని పేర్కొన్నారు. ఎవ్వరితోనూ సంబంధం లేకుండా, పగలు, రాత్రి తెలియకుండా వారు జీవిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఈ ఉద్యోగులపై దృష్టి సారించాలని కోరారు.

Similar News

News October 31, 2025

₹10,000 cr సాయానికి AI అభ్యర్థన

image

అహ్మదాబాద్‌లో బోయింగ్-787 కుప్పకూలిన తర్వాత ఎయిర్ ఇండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ ప్రమాదంలో 260మందికి పైగా మరణించారు. దీంతో నియంత్రణ నిబంధనలు కఠినమై సర్వీసుల నిర్వహణ కష్టంగా మారింది. ప్రాంతీయ ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా ఎయిర్ రూట్లలో దూరం పెరిగి ఖర్చుల భారం పెరిగింది. వీటి నుంచి బయటపడేందుకు ₹10,000CR సాయం అందించాలని యాజమాన్య సంస్థలు టాటాసన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ను AI అర్థించింది.

News October 31, 2025

MGB, NDAలకు కీలకంగా మారిన ‘బిహార్ వార్’

image

బిహార్‌లో ప్రధాన కూటములు పోటాపోటీ హామీలు గుప్పించాయి. ‘తేజస్వీ ప్రాణ్’ పేరిట MGB ‘సంపూర్ణ బిహార్ కా సంపూర్ణ పరివర్తన్’ నినాదంతో స్టేట్ రూపురేఖలు మారుస్తామంది. గత ప్రభుత్వ అవినీతిని నిర్మూలిస్తామని చెప్పింది. NDA ‘సంకల్ప్ పాత్ర్’ పేరుతో రాష్ట్రాన్ని పారిశ్రామిక, విద్యా కేంద్రంగా మారుస్తామని హామీ ఇచ్చింది. ఈ ఎన్నికలు అక్కడి పాలనా పగ్గాల కోసమే కాక హిందీ బెల్టులో పాగా వేసేందుకు కీలకం కావడమే కారణం.

News October 31, 2025

ఇతిహాసాలు క్విజ్ – 52 సమాధానాలు

image

1. జనకుని భార్య పేరు ‘సునయన’.
2. మహాభారతంలో రాధేయుడు ‘కృష్ణుడు’.
3. దత్తాత్రేయుడికి ‘24’ మంది గురువులు ఉన్నారు.
4. దేవతలకు వైద్యుడు ‘ధన్వంతరి’.
5. సముద్ర మథనంలో లక్ష్మీదేవికి ముందు పుట్టిన ఆమె అక్క పేరు ‘అలక్ష్మి’. ఆమెనే ‘జ్యేష్టా దేవి’ అని కూడా అంటారు.
<<-se>>#Ithihasaluquiz<<>>