News May 10, 2024

సోలార్ స్టాక్స్ జోరు.. ఏడాదిలో 1,318% రిటర్న్స్! – 1/2

image

దేశీయ స్టాక్ మార్కెట్లలో సోలార్ స్టాక్స్ దూసుకెళ్తున్నాయి. ఏడాది వ్యవధిలో వారీ రెన్యూవబుల్ అనే సంస్థ షేర్లు ఏకంగా 1,318% పెరిగాయి. గత నాలుగేళ్లలో అయితే 49,900% పెరిగింది. 2020లో కనిష్ఠంగా రూ.5కు పడిపోయిన షేర్ విలువ ఇప్పుడు రూ.2,600కు చేరింది. అప్పుడు రూ.100 కోట్లు ఉన్న మార్కెట్ క్యాప్ ఇప్పుడు రూ.27వేల కోట్లకు చేరింది. దేశీయ, విదేశీ సంస్థాగత పెట్టుబడుల ప్రమేయం లేకుండానే ఈ వృద్ధి సాధించడం విశేషం.

Similar News

News December 26, 2024

ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు

image

1932 Sep 26న ఇప్ప‌టి పాక్‌లోని చ‌క్వాల్‌లో మ‌న్మోహ‌న్ సింగ్ జ‌న్మించారు. 2004-2014 వ‌ర‌కు ప్ర‌ధానిగా ఆర్థిక సంస్క‌ర‌ణ‌లకు పెద్దపీట వేశారు. నెహ్రూ, ఇందిరా, మోదీ త‌రువాత అత్య‌ధిక కాలం దేశ ప్ర‌ధానిగా కొన‌సాగారు. 33 ఏళ్ల‌పాటు పార్ల‌మెంటు స‌భ్యుడిగా కొన‌సాగారు. 1991లో రాజ్య‌స‌భ‌లో అడుగుపెట్టారు. PV హయాంలో ఆర్థిక మంత్రిగా ప‌నిచేశారు. ఆర్థిక శాఖలో సలహాదారుగా, కార్యదర్శిగా, RBI గవర్నర్‌గా కూడా పనిచేశారు.

News December 26, 2024

మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ కన్నుమూత

image

భారత మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్(92) క‌న్నుమూశారు. ఇవాళ సాయంత్రం తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన ఆయ‌న్ను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడ ఎమ‌ర్జెన్సీ వార్డులో వైద్యులు చికిత్స అందించారు. అయితే కొద్దిసేప‌టికే మన్మోహన్ తుది శ్వాస విడిచినట్టు వారు ప్రకటించారు.

News December 26, 2024

రైతు భరోసాపై ప్రభుత్వం కీలక నిర్ణయం!

image

TG: కుటుంబంలో ఎంత మంది పేర్ల మీద భూమి ఉన్నా ఏడెకరాల వరకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఐదేళ్లలో వరుసగా రెండేళ్లు ఫ్యామిలీలో ఎవరైనా ఆదాయపు పన్ను చెల్లిస్తే భరోసా వర్తించదని తెలుస్తోంది. ఖరీఫ్, రబీ సీజన్లలో సాగు చేసిన భూమికే లబ్ధి చేకూర్చనుంది. పంటలు సాగు చేశారో లేదో తెలుసుకునేందుకు శాటిలైట్ సర్వే నిర్వహించనుంది. ఈ మేరకు మార్గదర్శకాల రూపకల్పన దాదాపు పూర్తయింది.