News July 3, 2024
ప్రజా సమస్యలు పరిష్కరించడమే తప్పైపోయింది: YCP మాజీ MLA

AP: ప్రజలకు ఏ సమస్య లేకుండా చేయడం వల్లే ఓటమి పాలయ్యామని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడమే తప్పై పోయిందని చెప్పారు. ‘ఎవరైనా అడిగితేనే మేలు చేయాలి. అడగనిదే ఇస్తే దేనికీ విలువ ఉండదు. అదే వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పు. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో జనం సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం కూడా తప్పిదమైంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News November 24, 2025
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అమ్మితే క్రిమినల్ కేసులు

TG: ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అమ్మితే లబ్ధిదారులపై POT యాక్ట్ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హౌసింగ్ కార్పొరేషన్ MD పీవీ గౌతమ్ తెలిపారు. అలాంటి ఇళ్లను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. ఇళ్లు అద్దెకు ఇచ్చినా రద్దు చేస్తామని పేర్కొన్నారు. GHMCలో ఇప్పటికే సర్వే చేశామని, త్వరలో జిల్లాల్లోనూ సర్వే చేస్తామన్నారు. కొల్లూరు, రాంపల్లిలో ₹20L-50Lకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
News November 24, 2025
నరదృష్టిని తొలగించే స్తోత్రం

కాళికే పాపహరిణి దృష్టిదోష వినాశిని ।
శత్రు సంహారిణి మాతా రక్ష రక్ష నమోస్తుతే ॥
మనపై, మన ఇల్లు, వ్యాపారం వంటి వాటిపై ఇతరుల చెడు దృష్టి పడినప్పుడు, ఆ దృష్టి దోషాల నివారణ కోసం ఈ శ్లోకాన్ని పఠిస్తారు. శత్రు భయం, నెగటివ్ ఆలోచనల నుంచి ఇది మనల్ని విముక్తుల్ని చేస్తుంది. రోజూ పఠిస్తే.. ఆటంకాలు తొలగిపోయి, అమ్మవారి రక్షణ ఎప్పుడూ ఉంటుందని, జీవితం సుఖశాంతులతో సాగుతుందని పండితులు చెబుతున్నారు.
News November 24, 2025
నేడు కొత్త CJI ప్రమాణ స్వీకారం.. తొలిసారి విదేశీ అతిథుల రాక

53వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(CJI)గా జస్టిస్ సూర్యకాంత్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీలోని ప్రెసిడెంట్ భవన్లో రాష్ట్రపతి ముర్ము ఆయనతో ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి భూటాన్, కెన్యా, మలేషియా, మారిషస్, SL, నేపాల్ దేశాల చీఫ్ జస్టిస్లు హాజరుకానున్నారు. CJI ప్రమాణ స్వీకారానికి విదేశీ అతిథులు రావడం ఇదే తొలిసారి. కాగా CJIగా బాధ్యతలు చేపట్టిన తొలి హరియాణా వ్యక్తిగా సూర్యకాంత్ నిలవనున్నారు.


