News April 8, 2024
గర్ల్‌ఫ్రెండ్స్ ముందు సిక్సులు కొట్టొద్దని కొందరు కోరారు.. కానీ: రోహిత్

గర్ల్‌ఫ్రెండ్స్ స్టేడియానికి వచ్చినపుడు తమ బౌలింగులో సిక్సులు కొట్టొద్దని కొందరు కోరారని రోహిత్ శర్మ వెల్లడించారు. అయితే ఆ వినతులను తాను సున్నితంగా తిరస్కరించానని తెలిపారు. కపిల్ షోలో మాట్లాడుతూ.. ‘వాళ్ల గర్ల్‌ఫ్రెండ్స్ గ్రౌండుకు వచ్చినట్లే.. నా భార్య రితికా కూడా వస్తుంది. మ్యాచ్‌ను టెన్షన్‌గా చూస్తూ ఉంటుంది. ఆమె నాకు చాలా ముఖ్యం’ అని పేర్కొన్నారు.
Similar News
News March 27, 2026
ఈ రామాలయాలు ప్రత్యేకం

రామాలయాల్లో లక్ష్మణుడు ఉండటం సహజం. కానీ కొన్ని క్షేత్రాల్లో రాముడు-సీత మాత్రమే కనిపిస్తారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలోని ఏకశిలా విగ్రహంపై సీతను ఒడిలో కూర్చోబెట్టుకున్న రాముడి రూపం కనిపిస్తుంది. దేశంలో ఇలా ఉన్న ఆలయం ఇదొకటేనని పండితులు చెబుతున్నారు. ఇక ఒంటిమిట్ట రామాలయంలో ఆంజనేయుడు ఉండడు. వనవాసంలో ఈ ప్రాంతాన్ని సీతారాములు సందర్శించారని, అప్పటికి హనుమంతుడు పరిచయం కాకపోవడంతో ఆయన విగ్రహం ఉండదట.
News March 27, 2026
లిల్లీ పంటలో దుంపకుళ్లు తెగులు – నివారణ

లిల్లీ పంటలో దుంపకుళ్లు తెగులు అధిక తేమ మరియు శిలీంధ్రాల వల్ల వస్తుంది. ఇది పంట దిగుబడిని భారీగా దెబ్బతీస్తుంది. ఈ తెగులు సోకిన మొక్క ఆకులు పసుపు రంగులోకి మారతాయి. తెగులు తీవ్రమైతే మొక్క మొత్తం వడిలిపోయి, ఎండిపోతుంది. భూమిలో ఉన్న దుంపలు మెత్తబడి, కుళ్లిపోయి దుర్వాసన వస్తుంది. ఈ తెగులు నివారణకు లీటరు నీటికి హెక్సాకొనజోల్ 2ml లేదా ప్రొపికొనజోల్ 1ml కలిపి పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
News March 27, 2026
పారాక్వాట్‌ను బ్యాన్ చేయండి.. PM, CMకు నటుడి విజ్ఞప్తి

TG: కలుపు నివారణకు వాడే పారాక్వాట్(గడ్డి మందు)ను బ్యాన్ చేయాలని నటుడు రాహుల్ రామకృష్ణ ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌కు విజ్ఞప్తి చేశారు. దాన్ని తాగి తన సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మందు సులభంగా దొరకడం వల్ల దుర్వినియోగం జరుగుతోందన్నారు. కాగా ఈ మందు విక్రయాలపై ప్రభుత్వం ఇప్పటికే <<19342790>>నియంత్రణ చర్యలు<<>> చేపట్టింది.


