News March 16, 2024
కొన్ని బంధాలు ఎప్పటికీ ఒకేలా ఉంటాయి: పాండ్య

గుజరాత్ టైటాన్స్ నుంచి తిరిగి హోమ్ టీమైన ముంబై ఇండియన్స్‌కు తిరిగొచ్చిన హార్దిక్ పాండ్య ప్రాక్టీస్ మొదలుపెట్టారు. తన మిత్రులతో కలిసి పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నాను. తాజాగా ముంబై స్టార్ ప్లేయర్ పొలార్డ్‌తో ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ.. ‘కొన్ని బంధాలు ఎప్పటికీ మారవు. మరింత బలపడతాయి. నా సోదరుడు పొలార్డ్‌తో కలిసి మళ్లీ పని చేయడానికి సంతోషిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.
Similar News
News August 19, 2025
USతో ఉక్రెయిన్ భారీ వెపన్ డీల్!

USకు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ $100 బిలియన్ల వెపన్ డీల్ ఆఫర్ చేసినట్లు Financial Times వెల్లడించింది. ట్రంప్‌తో భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. యూరప్ ఫండ్స్‌తో US నుంచి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, డ్రోన్స్ కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. బదులుగా రష్యాతో వార్ తర్వాత తమకు భద్రత కల్పించాలని కోరినట్లు చెప్పింది. దీంతో ట్రంప్‌కు కావాల్సింది ఇదేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
News August 19, 2025
దీపావళి వరకు సేల్స్ డౌన్!

జీఎస్టీ సంస్కరణలు తీసుకొస్తామంటూ ప్రధాని మోదీ చేసిన <<17409983>>ప్రకటన<<>> వాణిజ్య రంగంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీపావళి నుంచి కొత్త GST అమల్లోకి వచ్చే అవకాశం ఉండటంతో <<17418489>>ధరలు<<>> భారీగా తగ్గనున్నాయి. దీంతో వినియోగదారులు దీపావళి తర్వాతే కొనుగోళ్లకు మొగ్గు చూపుతారని వ్యాపార నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే పండగ వరకు అమ్మకాలు తగ్గుతాయని చెబుతున్నారు.
News August 19, 2025
రూ.7.50 లక్షల ప్రశ్న.. జవాబు చెప్పండి!

గత వారం కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో క్రికెట్‌కు సంబంధించి పలు ప్రశ్నలు వచ్చాయి. హోస్ట్ అమితాబ్ రూ.7.50 లక్షలకు IPLపై ఓ ప్రశ్న అడిగారు.
Q: ఐపీఎల్ చరిత్రలో రెండు సార్లు పర్పుల్ క్యాప్ గెలవని ప్లేయర్ ఎవరు?
A. లసిత్ మలింగ B. హర్షల్ పటేల్
C. డ్వేన్ బ్రావో D. భువనేశ్వర్ కుమార్
>> సరైన జవాబు ఏంటో కామెంట్ చేయండి.