News January 16, 2025

నిద్రలో వచ్చే కలల గురించి కొన్ని నిజాలు

image

ప్రతి ఒక్కరికీ నిద్రలో కలలు రావడం సహజం. అవి ఎందుకు వస్తాయో కచ్చితమైన ఆధారాలేవీ లేవు. కలల గురించి కొన్ని నిజాలు..
✒ ప్రతి నిద్రలో 3-6 కలలు వస్తాయి.
✒ ఒక్కో కల 5- 20ని.లు ఉంటుంది.
✒ నిద్రలేచే సరికి 95% కలలు గుర్తుండవు.
✒ మనకు తీరని కోరికలే కలలుగా వస్తాయి.
✒ కలల వల్ల మెదడులో కొన్ని జ్ఞాపకాలు వృద్ధి చెందుతాయి.
✒ ఇంద్రియాల స్పర్శ జ్ఞానం ఎక్కువగా ఉండటం వల్ల అంధులకు కలలు ఎక్కువగా వస్తాయి.

Similar News

News October 24, 2025

ట్రెండ్ Shift: బ్రాండ్ కాదు! మ్యాటర్ ఉందా? లేదా?

image

IIT, IIMలలో చదివినోళ్లకే కంపెనీల రెడ్ కార్పెట్ అనే ట్రెండ్ మారుతోంది. ప్రస్తుతం టైర్-3 కాలేజ్ గ్రాడ్యుయేట్లనూ కంపెనీలు సెలక్ట్ చేసుకుంటున్నాయని కమ్యూనిటీ యాప్ ‘బ్లైండ్’ సర్వేలో వెల్లడైంది. యాపిల్, NVIDIA, SAP, పేపాల్, జోహో వంటి సంస్థల్లో 1/3 ఎంప్లాయిస్ సాధారణ కాలేజీల్లో చదివిన వారేనట. బ్రాండెడ్ ఇన్‌స్టిట్యూట్స్ మొదట్లో జాబ్ పొందడంలో వాల్యూ యాడ్ చేస్తున్నా ఆ తర్వాత టాలెంట్ ఆధారంగా గ్రోత్ ఉంటోంది.

News October 24, 2025

తెలంగాణ న్యూస్ రౌండప్

image

* కర్నూల్ బస్సు ప్రమాదంపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దిగ్ర్భాంతి.. రహదారుల భద్రతపై కఠిన చర్యలు చేపట్టాలని సూచన
* ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలన్న BJP స్టేట్ చీఫ్ రామ్‌చందర్‌రావు
* జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో 58 మంది.. నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్న 23 మంది
* సినీ కార్మికుల సమస్యల పరిష్కారానికి టాలీవుడ్ ప్రముఖులతో ప్రభుత్వ ప్రత్యేక కమిటీ చర్చలు

News October 24, 2025

చల్కా భూములను సాగుకు అనువుగా ఎలా మార్చాలి?

image

చల్కా నేలల్లో లవణం, ఇసుక సమాన మోతాదులో ఉంటాయి. సేంద్రియ కర్బనం తక్కువగా.. ఐరన్, అల్యూమినియం ఆక్సైడ్‌లు ఎక్కువగా ఉండటం వల్ల సాగులో సమస్యలు వస్తాయి. ఈ భూముల్లో మొలక రాకపోవటం, వచ్చినా దెబ్బతినడం, మొక్కల సాంద్రత తగ్గుతుంది. ఈ భూముల్లో ఏటా ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువును పంట విత్తే ముందు వేసుకోవాలి. మల్చింగ్‌ వేయాలి. విత్తిన సాళ్ల వెంబడి పశువుల ఎరువును వేస్తే మొలక శాతం పెరుగుతుంది.