News November 18, 2024

మెదడుకు హాని కలిగించే కొన్ని అలవాట్లు

image

* మొబైల్ ఫోన్ అతిగా వాడటం
* ఎక్కువ సేపు ఒకేచోట కూర్చోవడం
* కొత్త విషయాలు నేర్చుకోవడాన్ని తిరస్కరించడం
* పోషకాహారం కాకుండా నచ్చిన ఫుడ్ తినడం
* శరీరానికి సరిపడా నిద్ర, విశ్రాంతి లేకపోవడం
* నిరంతరం రకరకాల పనులు చేయడం మానేయాలని వైద్యులు సూచిస్తున్నారు.
SHARE IT

Similar News

News January 2, 2026

భారీగా పెరిగిన కూరగాయల ధరలు

image

కొత్త సంవత్సరం సామాన్యుడికి ధరల షాక్‌తో ప్రారంభమైంది. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి. తీవ్రమైన చలి వల్ల కూరగాయల దిగుబడి తగ్గి టమాటా, బీర, బెండ కిలో రూ.80-100కు చేరాయి. పచ్చిమిర్చి సెంచరీ దాటగా, మునగకాయ ధర కిలో రూ.400 పలుకుతోంది. చికెన్ కిలో రూ.300, కోడిగుడ్డు ఒక్కోటి రూ.8కు చేరింది. సంక్రాంతి పండుగ వస్తుండటంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

News January 2, 2026

మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు సూచనలు (1/2)

image

మొక్కజొన్న విత్తిన వెంటనే ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను అమర్చి కత్తెర పురుగు ఉనికిని గమనించాలి. మొక్కలపై వాటి గుడ్లను గమనిస్తే వేపమందును పిచికారీ చేయాలి. లేత మొక్కజొన్న పంటల్లో 30 రోజుల వరకు ఎకరాకు 15 పక్షి స్థావరాలను, 15 లింగాకర్షక బుట్టలను పైరులో ఏర్పాటు చేసుకోవాలి. ఎకరాకు 9 కిలోల పొడి ఇసుక, కిలో సున్నాన్ని కలిపి మొక్కజొన్న సుడులలో వేస్తే ఇసుక రాపిడికి కత్తెర పురుగు లార్వాలు చనిపోతాయి.

News January 2, 2026

రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఖవాజా

image

ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. సిడ్నీలో ఈ నెల 4 నుంచి ENGతో జరిగే ఐదో యాషెస్ టెస్ట్ తర్వాత రిటైర్ కానున్నట్లు ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. ఈ 39 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ AUS తరఫున 87 టెస్టుల్లో 6,206 రన్స్, 40 వన్డేల్లో 1,154, 9 టీ20ల్లో 241 పరుగులు చేశారు. పాక్‌లో జన్మించిన ఖవాజా ఆస్ట్రేలియా తరఫున ఆడిన తొలి ముస్లిం క్రికెటర్‌గా నిలిచారు.