News November 12, 2024

నా భర్త సినిమాలు కొన్ని అస్సలు నచ్చవు: మోహన్‌లాల్ భార్య

image

తన భర్త సినిమాలు అందరికీ నచ్చినా తనకు మాత్రం కొన్ని నచ్చవని మలయాళ స్టార్ మోహన్‌లాల్ భార్య సుచిత్ర ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఆయన సినిమాలు కొన్నింటిని అస్సలు చూడలేకపోయాను. ఆ విషయాన్ని ఆయనతో కరాఖండీగా చెబుతుంటాను. నా అభిప్రాయాలు ఎలా ఉన్నా సినిమా వెనుక ఉన్న కృషిని మాత్రం గౌరవిస్తాను’ అని పేర్కొన్నారు. మోహన్‌లాల్-సుచిత్ర 1988లో పెళ్లాడగా వారికి ప్రణయ్, విస్మయ అనే ఇద్దరు పిల్లలున్నారు.

Similar News

News October 14, 2025

హైకోర్టు స్టేపై సుప్రీంలో పిటిషన్.. నేడే విచారణ!

image

TG: BC రిజర్వేషన్ల అంశంలో హైకోర్టు స్టేపై 50పేజీల సమగ్ర సమాచారంతో ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రధానంగా ఇందిరా సాహ్నీ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ కేసును రిఫరెన్స్‌గా చూపింది. రాజకీయ రిజర్వేషన్లకు ఈ తీర్పు అడ్డంకి కాదని ప్రస్తావించింది. 50% రిజర్వేషన్ల క్యాప్ దాటొద్దని చెప్పినా అది విద్య, ఉపాధి రంగాలకే పరిమితమని గుర్తు చేసింది. ఈ పిటిషన్‌ ఇవాళ విచారణకు వచ్చే అవకాశముంది.

News October 14, 2025

పశువులు, గొర్రెల, మేకల ఎరువుతో లాభాలు

image

ఒక టన్ను పశువుల ఎరువును పొలంలో వేస్తే 5-15KGల నత్రజని, 4-8KGల భాస్వరం, 5-19 KGల పొటాష్ పొలానికి అందుతాయి. గొర్రెలు, మేకల ఎరువు టన్ను వేస్తే 5-7KGల నత్రజని, 4-6KGల భాస్వరం, 8-10KGల పొటాష్ భూమికి అందుతుంది. పొలంలో సేంద్రియ పదార్థం పెరగడంతో పాటు భూమి గుల్లబారి పంటకు పోషకాలు తొందరగా అందుతాయి. గొర్రెల మందలను ఖాళీ పొలంలో కడితే వాటి మలమూత్రాలతోనూ భూసారం పెరుగుతుంది.

News October 14, 2025

APPLY NOW: ఐఐటీ ఇండోర్‌లో 16 పోస్టులు

image

ఐఐటీ ఇండోర్ 16 ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈ నెల 17 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టులో పీహెచ్‌డీ, ఏదైనా ఐఐటీ నుండి డిజైనింగ్ డిప్లొమా/ ఆర్ట్స్/అప్లైడ్ ఆర్ట్స్‌ ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. ఒప్పంద ప్రాతిపదికన ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.iiti.ac.in/