News September 12, 2024
నెపోటిజం వల్ల కొన్ని అవకాశాలు కోల్పోయా: రకుల్ ప్రీత్

సినీ ఇండస్ట్రీలో నెపోటిజం వల్ల తాను కొన్ని అవకాశాలు కోల్పోయినట్లు హీరోయిన్ రకుల్ ప్రీత్ వెల్లడించారు. కానీ ఈ విషయంలో తానెప్పుడూ బాధపడలేదన్నారు. ‘స్టార్ కిడ్స్‌కు సినిమాల్లో ఈజీగా అవకాశాలు రావడానికి కారణం వారి పేరెంట్స్ పడిన కష్టమే. నేను కూడా భవిష్యత్తులో నా పిల్లలకి అవసరమైతే సాయం చేస్తాను. లైన్‌లో నిలబడి అదృష్టాన్ని పరీక్షించుకోండి అని చెప్పను’ అని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
Similar News
News February 15, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 15, 2026
గూడెబెల్లూర్ నుంచి మహబూబ్‌నగర్ దాకా NH-167 విస్తరణ: మోదీ

TG: హైదరాబాద్-పనాజీ ఎకనమిక్ కారిడార్‌లో భాగంగా గూడెబెల్లూర్ నుంచి మహబూబ్‌నగర్ వరకు NH-167ను 4 వరుసలుగా విస్తరించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. దీనిపై PM మోదీ తెలుగులో ట్వీట్ చేశారు. ‘NH-167 విస్తరణ నిర్ణయం ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేస్తుంది. ఉపాధి అవకాశాలు సృష్టించి, ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తుంది’ అని పేర్కొన్నారు. 80KM పొడవైన ఈ ప్రాజెక్టుకు ₹3,175 కోట్లు ఖర్చవుతుందని అంచనా.
News February 15, 2026
బంగ్లా ఎన్నికల్లో ఓ సీటు గెలిచిన ‘BJP’!

బంగ్లాదేశ్ ఎన్నికల్లో BJP ఓ సీటు గెలుచుకుంది. మీరు చదివింది నిజమే. కాకపోతే అక్కడున్నది బంగ్లాదేశ్ జాతీయ పార్టీ(BJP). భోలా-1 నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థి అందలీవె రహ్మాన్ పార్థో విజయం సాధించారు. దేశంలో 297 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో BNP 209 సీట్లు <<19125261>>దక్కించుకోవడం<<>> తెలిసిందే. ఇక జమాత్ కూటమి 77 స్థానాలకే పరిమితమైంది. మరోవైపు <<19132575>>జులై ఛార్టర్<<>>కు అనుకూలంగా ఏకంగా 70 శాతం మంది ఓటు వేశారు.


