News February 8, 2025
కొందరు వెన్నుపోటు పొడిచారు: తమన్

తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలను మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘నా కెరీర్‌లో నేను ఎంతోమందిని నమ్మి మోసపోయా. వారు నాకు వెన్నుపోటు పొడిచారు. నా ఎదుట మంచిగా ఉండి.. పక్కకు వెళ్లగానే నా గురించి చెత్తగా మాట్లాడేవారు. కొందరిని నమ్మి ఎంతో డబ్బు పోగొట్టుకున్నా. వీటన్నిటి నుంచి జీవిత పాఠాలు నేర్చుకున్నా. ఎప్పుడైనా ఒత్తిడికి గురైతే వెంటనే గ్రౌండ్‌కు వెళ్లి క్రికెట్ ఆడతా’ అని చెప్పుకొచ్చారు.
Similar News
News March 18, 2026
ఎరువుల వాడకంలో నిపుణుల సూచనలు

వేసవిలో భూసార పరీక్షలు నిర్వహించి ఫలితాల ఆధారంగా సిఫార్సు చేసిన ఎరువులను వాడాలి. రసాయన ఎరువులతో పాటు సేంద్రియ, జీవన, పచ్చిరొట్ట పైర్ల ఎరువులను వాడటం వల్ల ఎరువుల సమతుల్యత జరిగి పంట దిగుబడి పెరుగుతుంది. నీటి నాణ్యత, పంటకాలం, పంటల సరళిని బట్టి ఎరువులను వేయాలి. సమస్యాత్మక భూముల్లో జిప్సం, సున్నం, పచ్చిరొట్ట ఎరువులు, సూక్ష్మపోషకాలను వేసి నేలలో లోపాలను సరిచేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News March 18, 2026
ఇదేంటి భయ్యా.. రోజూ రేట్ పెంచుతున్నారు?

తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాలకు శిక్షణ తీసుకుంటున్న, జాబ్ చేస్తూ రూముల్లో ఉంటున్న బ్యాచిలర్లు అంటున్న మాటలివి. LPG కొరతతో పలు హోటళ్లు క్లోజింగ్ బోర్డులు పెట్టగా.. మరికొన్ని టిఫిన్లు, కర్రీలపై 2-3 రోజులకు రూ.5 పెరుగుతోందని వాపోతున్నారు. గ్యాస్ కొరత నిజమే అయినా రోజూ దాన్ని సాకుగా చూపుతూ ధరలు పెంచడం కరెక్ట్ కాదంటున్నారు. గత 10 రోజుల్లో వీటిపై రూ.15 వరకు పెంచినట్లు చెబుతున్నారు. మీ ఏరియాలో ఎలా ఉంది?
News March 18, 2026
నేడు అకౌంట్లలోకి డబ్బులు

AP: పోలవరం ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతుల ఖాతాల్లో నేడు ప్రభుత్వం రూ.250 కోట్లు జమ చేయనుంది. ఉగాది కానుకగా CM చంద్రబాబు ఇవాళ కొంతమంది నిర్వాసితులకు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో చెక్కులు అందజేయనున్నారు. వీరికి గతేడాది సంక్రాంతికి రూ.980 కోట్లు, దీపావళికి రూ.1,000 కోట్లు ఇచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. 2016లో తాము రూ.700 కోట్లు ఇవ్వగా.. YCP హయాంలో ఒక్క రూపాయీ చెల్లించలేదని ఆరోపిస్తోంది.


