News June 22, 2024

NEETపై కొన్ని రాజకీయ పార్టీలు మౌనంగా ఉన్నాయి: VSR

image

NEET యూజీ పరీక్షలో జరిగిన అవకతవకలపై కొన్ని రాజకీయ పార్టీలు మౌనంగా ఉన్నాయని వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి మండిపడ్డారు. నీట్ యూజీ పరీక్షకు ఏపీ నుంచి హాజరైన 60వేల మందితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 23 లక్షల మంది విద్యార్థుల కోసం ఆ నాయకులు ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. ఇది చూస్తుంటే వారికి ప్రజలు, విద్యార్థుల జీవితాల కంటే రాజకీయాలే ముఖ్యమని తెలుస్తోందని ఎద్దేవా చేశారు.

Similar News

News November 11, 2025

లేటెస్ట్ అప్‌డేట్స్

image

⋆ విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన NIA.. సిరాజ్ ఉర్ రెహమాన్(VZM), సయ్యద్ సమీర్(HYD) యువతను టెర్రరిజంవైపు ప్రేరేపించేలా కుట్ర పన్నారని అభియోగాలు
⋆ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న పిటిషన్‌పై వెనక్కి తగ్గిన YS జగన్.. NOV 21లోగా CBI కోర్టులో హాజరవుతానని స్పష్టీకరణ.. యూరప్ వెళితే NOV 14లోగా కోర్టులో హాజరుకావాలని గతంలో ఆదేశించిన కోర్టు
* జూబ్లీహిల్స్‌లో 50.16% ఓటింగ్ నమోదు

News November 11, 2025

పాక్‌లో ఆత్మాహుతి దాడి వెనుక భారత్: షరీఫ్

image

పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరోసారి భారత్‌పై విషం కక్కారు. ఇస్లామాబాద్‌లో జరిగిన <<18258453>>ఆత్మాహుతి దాడి<<>> వెనుక ఇండియా ఉందంటూ ఆరోపించారు. తమ దేశాన్ని అస్థిరపరిచే లక్ష్యంతో ఢిల్లీ కుట్రలు చేస్తోందని విమర్శించారు. అఫ్గాన్ కేంద్రంగా పనిచేసే TTP భారత్ ఆడించే తోలుబొమ్మ అని అక్కసు వెళ్లగక్కారు. ఇది అనేక మంది చిన్నపిల్లలపై దాడులు చేస్తోందని, దీన్ని ఎంత ఖండించినా సరిపోదంటూ మొసలి కన్నీళ్లు కార్చారు.

News November 11, 2025

తానికాయ.. ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

image

త్రిఫలాలలో(ఉసిరి, తాని, క‌ర‌క్కాయ‌) ఒకటైన తానికాయలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. తానికాయ పొడిలో తేనె కలిపి తీసుకుంటే దగ్గు, జలుబు, ఆస్తమా సమస్యలు, గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందని సూచిస్తున్నారు. విరేచనాలు, చిన్న పేగుల వాపు తగ్గి.. జీర్ణ, శ్వాస, మూత్రాశయ వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుందని అంటున్నారు. ఈ పొడిలో చక్కెర కలిపి తింటే కంటిచూపు మెరుగవుతుందని చెబుతున్నారు.