News October 7, 2025

సమ్‌థింగ్ ఫిషీ.. ‘బుల్ ఇష్యూ’పై కాంగ్రెస్ ఫోకస్

image

TG: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాటల మంటలు హాట్ టాపిక్‌గా మారాయి. ఏళ్లుగా ఉన్న చనువుతో వారి మధ్య ‘దున్నపోతు’ లాంటి పర్సనల్ కామెంట్స్ కామన్‌గా కాంగ్రెస్ భావించింది. కానీ ఇవాళ పొన్నంపై లక్ష్మణ్ ఫైరయ్యారు. అటు మరో మంత్రి వివేక్ తనను సహించడం లేదని ఆరోపించడంతో సమ్‌థింగ్ ఫిషీ అని కాంగ్రెస్ రంగంలోకి దిగింది. వీరి మధ్య గ్యాప్ ఇష్యూ క్లోజ్ చేసేందుకు మంత్రి శ్రీధర్ బాబు, PCC చీఫ్ వారితో చర్చిస్తున్నారు.

Similar News

News October 7, 2025

హైదరాబాద్‌లో భారీ వర్షం

image

మహానగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నాంపల్లి, అబిడ్స్, హిమాయత్‌నగర్, బర్కత్‌పురా, నల్లకుంట, కోఠి, కాచిగూడ ప్రాంతాల్లో భారీ వాన పడుతోంది. అటు యాదాద్రి, కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, MBNR, మెదక్, మేడ్చల్, నల్గొండ, నిజామాబాద్, RR, సిద్దిపేట, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లోనూ రానున్న 2 గంటల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మీ ఏరియాలో వాన పడుతోందా?

News October 7, 2025

బిహార్‌ ఎలక్షన్స్.. బీజేపీ, జేడీయూకి సమాన సీట్లు!

image

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలు బీజేపీ, జేడీయూ మధ్య సీట్ల కసరత్తు జరుగుతోంది. మొత్తం 243 సీట్లలో 205 చోట్ల ఇరు పార్టీలు సమాన స్థానాల్లో బరిలో దిగాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన 38 సీట్లు NDAలోని LJP, HAM, RLMలకు ఖరారయ్యే అవకాశం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ, జేడీయూ కలిసి పోటీ చేసి అధికారం చేపట్టాయి. ఇక బిహార్ ఎన్నికలు NOV 6, 11న జరగనుండగా 14న ఫలితాలు వెలువడతాయి.

News October 7, 2025

‘SIR’ ఎన్నికల కమిషన్ విశేషాధికారం: SC

image

బిహార్‌లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ఎన్నికల కమిషన్ విశేషాధికారమని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఇందులో జోక్యం చేసుకోలేమని విచారణ సందర్భంగా పేర్కొంది. అందరి విధుల్లో తాము జోక్యం చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారని పిటిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు బిహార్‌లో ఫైనల్ ఓటర్ లిస్ట్‌ను ప్రకటించినట్లు కోర్టుకు EC తెలిపింది. రాజకీయ నాయకులే అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని వివరించింది.