News June 4, 2024

సర్వేపల్లిలో టీడీపీ జెండా పాతిన సోమిరెడ్డి

image

AP: నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలిచారు. వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్దన్ రెడ్డిపై 16 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో నెగ్గారు. కాగా సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓటమిపాలయ్యారు. 2012లో కోవూరు ఉపఎన్నికలో కూడా ఓడిపోయారు. రెండు దశాబ్దాల తర్వాత ఆయన గెలుపు రుచి చూశారు.

Similar News

News January 10, 2026

HYDలో ఫ్యూచర్ సిటీ.. ‘పంచాయతీ’ పవర్ కట్!

image

ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రభుత్వం భారీ స్కెచ్ వేసి, RR(D)లోని 56 గ్రామాలను FCDA పరిధిలోకి తీసుకువచ్చింది. ఇక్కడి భూముల క్రయవిక్రయాలు, లేఅవుట్లకు ఇకపై పంచాయతీల సంతకాలు చెల్లకపోగా, గ్రామసభల ప్రమేయం లేకుండానే సాగు భూములను కమర్షియల్ జోన్లుగా మార్చే అధికారం బోర్డుకే కట్టబెట్టింది. భూములపై పూర్తి పట్టుకోసమే ఈ ‘సూపర్ బాడీ’ని తెచ్చారని, అభివృద్ధి ముసుగులో పల్లెగొంతు నొక్కేస్తున్నారని స్థానికులు అంటున్నారు.

News January 10, 2026

తమీమ్-బీసీబీ మధ్య మాటల యుద్ధం

image

T20 వరల్డ్ కప్ భారత్‌లో కాకుండా న్యూట్రల్ వేదికల్లో పెట్టాలంటూ <<18761652>>BCB<<>> కోరిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ అంశం బంగ్లాదేశ్ క్రికెట్‌లో తీవ్ర వివాదానికి దారి తీసింది. ‘మనకు ఎక్కువ ఆదాయం ICC నుంచే వస్తోంది కాబట్టి భవిష్యత్ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి’ అని బంగ్లాదేశ్‌ మాజీ క్రికెటర్‌ తమీమ్ ఇక్బాల్ సూచించారు. దీనిపై బీసీబీ సభ్యుడు నజ్ముల్ ఇస్లాం తమీమ్‌ “ఇండియన్ ఏజెంట్” అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

News January 10, 2026

స్లీపర్‌ బస్సులపై కేంద్రం కఠిన నిబంధనలు

image

దేశంలో స్లీపర్‌ బస్సుల ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం నిబంధనలను కఠినతరం చేసింది. గత 6 నెలల్లో జరిగిన ప్రమాదాల్లో 145 మంది మృతి చెందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఇకపై స్లీపర్‌ బస్సులను ఆటోమొబైల్‌ కంపెనీలు లేదా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన తయారీదారులే నిర్మించాల్సి ఉంటుందన్నారు. బస్సుల్లో అన్ని రకాల భద్రతా పరికరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.