News May 7, 2025
నాన్నకు ఏమైందని కొడుకు అడుగుతున్నాడు.. జవాన్ భార్య ఆవేదన

పొరపాటున <<16202708>>సరిహద్దు దాటిన BSF జవాన్<<>> పూర్ణం సాహును పాకిస్థాన్ బంధించింది. దీంతో అతని కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. నాన్నకు ఏమైందని ఏడేళ్ల కొడుకు అడుగుతున్నాడని, ఏం చెప్పాలో అర్థం కావట్లేదని భార్య రజని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలియట్లేదని తండ్రి భోల్‌నాథ్ రోదిస్తున్నారు. బతికున్నాడా? లేదా? ఎప్పుడు తిరిగొస్తాడు? అని అధికారులను ప్రశ్నిస్తున్నారు.
Similar News
News January 24, 2026
ఎయిర్‌పోర్ట్‌లో అస్థిపంజరం కలకలం

ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో మానవ అస్థిపంజరం కనిపించడంతో సిబ్బంది షాక్‌కు గురయ్యారు. టెర్మినల్-3లో లగేజీ తనిఖీ చేస్తున్న సమయంలో ఓ బ్యాగ్‌లో కనిపించింది. వెంటనే పోలీసులు, ఎయిర్‌పోర్ట్ భద్రతా బృందాలు అప్రమత్తమయ్యారు. అయితే అది మెడికల్ విద్యార్థులు ఉపయోగించే డెమో స్కెలిటన్‌గా గుర్తించారు. ఆ బ్యాగ్ వైద్య విద్యార్థిది అని తేల్చారు. అయినప్పటికీ దానిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు.
News January 24, 2026
అభిషేక్ కెరీర్‌లో తొలి గోల్డెన్ డక్

భారత యువ బ్యాటర్ అభిషేక్ శర్మ కెరీర్‌లో తొలిసారి గోల్డెన్ డక్ నమోదు చేసుకున్నారు. NZతో జరుగుతున్న రెండో T20లో తొలి బంతికే అవుటై అభిమానులను నిరాశపరిచారు. జాకబ్ డఫీ వేసిన బంతిని ఆడబోయి కాన్వేకు క్యాచ్ ఇచ్చారు. ఇది అభిషేక్‌కు T20Iల్లో రెండో డక్. 2024లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో (డెబ్యూ) తొలిసారి డకౌట్ అయ్యారు. మొత్తంగా ఐపీఎల్‌తో కలిపి టీ20ల్లో 10 సార్లు 0 పరుగులకే వెనుదిరిగారు.
News January 24, 2026
LRS దరఖాస్తు గడువు పొడిగింపు

AP: అనధికార లేఅవుట్ల <<18905073>>రెగ్యులరైజేషన్‌కు<<>> విధించిన గడువును ఏప్రిల్ 23 వరకు పొడిగిస్తున్నట్లు మున్సిపల్ శాఖ ప్రకటించింది. రూ.10వేలు ఫీజు చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ ప్రక్రియలో ఆఫీసర్లు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఇప్పటివరకు 61,947 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించింది. కాగా ముందస్తు షెడ్యూల్ ప్రకారం LRS దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియాల్సి ఉంది.


