News November 23, 2024
బాబాయ్పై అబ్బాయి ఆధిక్యం..

మహారాష్ట్ర సీఎం అభ్యర్థుల్లో ఒకరిగా ఉన్న అజిత్ పవార్ ఆశ్చర్యకరంగా ఫలితాల్లో వెనకబడ్డారు. బారామతిలో ఆయన సోదరుడి కుమారుడు యుగేంద్ర పవార్ ఆధిక్యత కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. యుగేంద్ర తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. శరద్ పవార్ ఫ్యామిలీకి ఈ నియోజకవర్గం కంచుకోట. అటు కొప్రిలో సీఎం ఏక్నాథ్ శిండే ఆధిక్యంలో ఉన్నారు.
Similar News
News January 2, 2026
కృష్ణా జలాలపై ఎవరి దారి వారిదే

TG: కృష్ణా జలాలపై ప్రభుత్వం, BRS ఎవరి దారి వారిదే అన్నట్లు మారింది. దీనిపై అసెంబ్లీలో చర్చకు INC సిద్ధమవగా సభను బహిష్కరిస్తున్నట్లు విపక్షం ప్రకటించింది. కాగా రేపు TG భవన్లో ఈ అంశంపై MLAలతో సమావేశమై PPT ప్రజెంటేషన్ ఇవ్వాలని BRS నిర్ణయించింది. GOVT మాత్రం సభలో దీనిపై చర్చ గురించి ఇంకా తేల్చలేదు. చర్చించినా CPI, MIM సానుకూలమే. కేంద్రంలో అధికార పార్టీగా ఉన్న BJP తటస్థంగా ఉండొచ్చని భావిస్తున్నారు.
News January 2, 2026
బంగ్లాలో పర్యటించనున్న టీమ్ ఇండియా!

భారత జట్టు ఈ ఏడాది SEPలో బంగ్లాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. గతంలో పోస్ట్పోన్ అయిన పర్యటనను రీషెడ్యూల్ చేసినట్లు BCB క్రికెట్ ఆపరేషన్స్ ఇన్-ఛార్జ్ తెలిపినట్లు క్రిక్బజ్ పేర్కొంది. ‘ఆగస్టు 28న టీమ్ ఇండియా బంగ్లాదేశ్ చేరుకుంటుంది. SEP 1, 3, 6వ తేదీల్లో వన్డేలు, 9, 12, 13వ తేదీల్లో T20లు ఆడుతుంది’ అని తెలిపింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న దౌత్య విభేదాల నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యం నెలకొంది.
News January 2, 2026
విశాఖ ఏజెన్సీలో లాభాలు అందిస్తున్న స్ట్రాబెర్రీ సాగు

విశాఖ జిల్లా లంబసింగి పరిధిలో స్ట్రాబెర్రీ సాగు జోరందుకుంది. మంచి లాభాలు వస్తుండటంతో ఎక్కువ మంది రైతులు ఈ పంట సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. పుణె నుంచి మొక్కలు తెచ్చి నాటుతుండగా, ఏప్రిల్ చివరి వరకు దిగుబడి ఉంటుంది. ఎకరా సాగుకు రూ.3 లక్షల వరకు ఖర్చవుతోంది. ఇక్కడకు వచ్చే టూరిస్టులకు కాయలు, స్ట్రాబెర్రీ జామ్, స్ట్రాబెర్రీ చీజ్ కేక్, జూస్ రూపంలో విక్రయిస్తూ పెంపకందారులు మంచి ఆదాయం పొందుతున్నారు.


