News April 11, 2024
ఎన్నికల బరిలో ఇందిర హంతకుడి కుమారుడు

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హంతకుల్లో ఒకరి కుమారుడు ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తుండటం పంజాబ్‌లో ఆసక్తికరంగా మారింది. ఇందిరను కాల్చిన బియాంత్ సింగ్ కుమారుడు సరబ్‌జీత్ పంజాబ్‌లోని ఫరీద్‌కోట్ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈయన 2004, 2009లో బఠిండా నుంచి, 2007లో భదౌర్ అసెంబ్లీ స్థానం, 2014లో ఫతేగఢ్ సాహిబ్ స్థానాల నుంచి పోటీ చేశారు. అయితే ఎప్పుడూ విజయం సాధించలేదు.
Similar News
News February 6, 2026
PM కిసాన్ డబ్బులు రావాలంటే ఇది తప్పనిసరి

వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పథకాలను అర్హులైన రైతులకే అందించేందుకు కేంద్రం ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ తీసుకొచ్చింది. AP, TGల్లో దీని కోసం నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. PM కిసాన్, ఫసల్ బీమా, ఇతర కేంద్ర పథకాల ప్రయోజనాలు పొందాలంటే ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ తప్పనిసరి. దీన్ని ఎలా, ఎక్కడ నమోదు చేసుకోవాలి? ఏ పత్రాలు అవసరం? ఈ ప్రక్రియ వల్ల రైతులకు ఎలాంటి లాభాలు ఉంటాయో తెలుసుకోవడానికి<<-se_10015>> పాడిపంట కేటగిరీ క్లిక్<<>> చేయండి.
News February 6, 2026
మున్సిపల్ ప్రచారంలో AI పాటలు

TG: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి AI కొత్త ఊపునిస్తోంది. అభ్యర్థుల పేరు, గుర్తు, వార్డు వివరాలు, సేవా కార్యక్రమాలను ఏఐకి అందిస్తే చాలు ఆకట్టుకునే ప్రచార పాటలు నిమిషాల్లో సిద్ధమవుతున్నాయి. రచయిత, సంగీత దర్శకుడు, కొరియోగ్రాఫర్ అవసరం లేకుండానే స్లో నుంచి ఫాస్ట్ బీట్ వరకూ, జానపదం నుంచి భక్తిగీతాల దాకా పాటలు క్రియేట్ అవుతున్నాయి. ఇందుకోసం Suno, Beatoven, Make my song, Udio వంటి ప్లాట్‌ఫాంలు ఉన్నాయి.
News February 6, 2026
ఐఐటీ గువాహటిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<


