News August 20, 2024
పెళ్లి జరిగిన ఇంటిని అమ్మకానికి పెట్టిన సోనాక్షి

బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తన వివాహం జరిగిన ఇంటిని అమ్మకానికి పెట్టారు. ముంబైలోని బాంద్రా ఏరియాలో ఉన్న అపార్ట్మెంట్లో జూన్ 23న ఈమె వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఏమైందో ఏమో గానీ దీన్ని రూ.25 కోట్లకు అమ్మకానికి పెట్టారు. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌తో ఈ విషయం బయటకు వచ్చింది. కాగా ఆమె గతంలో తనతో పాటు నటించిన జహీర్ ఇక్బాల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
Similar News
News November 27, 2025
హైడ్రాపై కర్ణాటక బృందం ప్రశంసలు

TG: హైడ్రా (HYDRAA) చేపట్టిన చెరువుల పునరుద్ధరణ పనులను పరిశీలించిన కర్ణాటక ప్రతినిధులు ఈ మోడల్‌ను బెంగళూరుతో పాటు ఇతర మెట్రో నగరాలకు ఆదర్శంగా పేర్కొన్నారు. బతుకమ్మకుంట, నల్లచెరువు వంటి పునరుద్ధరించిన చెరువులను పరిశీలించారు. ఆక్రమణల తొలగింపు, పునరుద్ధరణలో హైడ్రా చేపట్టిన చర్యలను ప్రశంసించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో జరిగిన చర్చలో దీని అమలు విధానం, విభాగాల సమన్వయం గురించి తెలుసుకున్నారు.
News November 27, 2025
మైఖేల్ వాన్‌కు వసీం జాఫర్ కౌంటర్

ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. SAతో టెస్టు సిరీస్‌ను భారత్ కోల్పోవడంపై “డోంట్ వర్రీ వసీం, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో నాకు తెలుసు”అని వాన్ అన్నారు. దీనిపై స్పందించిన జాఫర్..”నా బాధ త్వరలో తీరిపోతుంది. కానీ నువ్వు మరో 4 టెస్టులు భరించాలి”అని యాషెస్ సిరీస్ మొదటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓటమిని ఉద్దేశించి ట్వీట్ చేశారు.
News November 26, 2025
రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం: CM

AP: రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గత పాలనలో ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు న్యాయం జరగాలని, సాంకేతిక ఇబ్బందులు ఉంటే తక్షణం పరిష్కరించాలని CRDA సమీక్షలో సూచించారు. మరోవైపు రాజధానిలో నిర్మాణాలు వేగంగా పూర్తి చేసేందుకు కార్యాచరణ చేయాలని, నిర్మాణాల నాణ్యత, వేగం విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని పేర్కొన్నారు.


