News March 8, 2025

‘జటాధర’లో సోనాక్షి సిన్హా.. ఫస్ట్ లుక్ విడుదల

image

బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. వెంకట్ కళ్యాణ్ తెరకెక్కిస్తున్న ‘జటాధర’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా మూవీ నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నారు. కాగా అనంత పద్మనాభ స్వామి ఆలయ కథాంశంతో హారర్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతున్నట్లు సమాచారం.

Similar News

News February 10, 2026

రాహుల్ చూపించిన ఆ బుక్‌లో ఏముంది..?

image

MM నరవణె బుక్‌లోని ‘గల్వాన్ దాడి’ గురించి CARAVAN మ్యాగజైన్ పోస్ట్ చేసింది. ఆ కథనం ప్రకారం ‘చైనా సేన మన స్థావరాలకు 1km దూరంలో మోహరించింది. కానీ స్పష్టమైన ఆదేశాల్లేకుండా కాల్పులు చేయొద్దని ఢిల్లీ నిబంధన. దీంతో రక్షణ మంత్రి, NSA, MEAలకు ఫోన్లో విషయం చెప్పా. కాసేపటికి DM ఫోన్ చేసి మోదీతో మాట్లాడా ‘ఏది మంచిదన్పిస్తే అది చేయండి’ అన్నట్లు చెప్పారు. దీంతో PMకు స్పష్టత లేదు అన్పించింది’ అని MM భావించారట.

News February 10, 2026

IPLకూ హర్షిత్ రాణా డౌటే!

image

టీమ్ ఇండియా యంగ్ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా మోకాలి గాయం కారణంగా సోమవారం సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం జరుగుతున్న T20 వరల్డ్ కప్ నుంచి మాత్రమే కాకుండా త్వరలో రాబోయే IPL సీజన్ నుంచి కూడా ఆయన దాదాపు తప్పుకున్నట్లేనని తెలుస్తోంది. సౌతాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో రాణా గాయపడ్డారు. త్వరలో బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిపోర్టు చేయనున్నారు.

News February 10, 2026

పిల్లల్లో ADHDకి మందులు వాడుతున్నారా?

image

పిల్లల్లో అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపరాక్టివ్‌ డిసీజ్‌(ADHD) నిర్ధారణ అయిన వెంటనే కొందరు వైద్యులు మందులు సిఫార్సు చేస్తారు. కానీ ఇది సరికాదంటోంది స్టాన్‌ఫర్డ్‌ మెడిసిన్‌ తాజా అధ్యయనం. ఆరేళ్లలోపు పిల్లల్లో మందులను ప్రాసెస్‌ చేసే మెటబాలిజం పూర్తిగా అభివృద్ధి చెందదు. దాంతో ఈ చికిత్స వల్ల ఎలాంటి ప్రయోజనమూ దక్కదంటున్నారు. మందులకంటే ముందు వాళ్లకు బిహేవియరల్‌ థెరపీ ఇవ్వాలని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.