News February 20, 2025
ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, శుక్రవారం డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఆస్పత్రిలో చేరడానికి గల కారణాలేంటో తెలియాల్సి ఉంది. గతేడాది DECలో సోనియా 78వ పడిలోకి అడుగుపెట్టారు.
Similar News
News January 6, 2026
మార్చి 1 నుంచి పట్టణ మహిళలకూ ఇందిరమ్మ చీరలు

TG: ఇందిరమ్మ చీరలను మార్చి 1 నుంచి పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు కూడా అందజేస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పొదుపు సంఘాల్లో సభ్యులైన 67 లక్షల మంది మహిళలకు ఇప్పటికే చీరలు పంపిణీ చేశామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమం కోసం మరో 40 లక్షల చీరలను కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. మహిళల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు.
News January 6, 2026
పిల్లలకు బోటులిజం వస్తే ఏమవుతుందంటే?

ఇంఫాంట్ బోటులిజంలో పిల్లల కండరాలు బలహీనపడతాయి. చూపు మందగించడం, అలసట, నీరసం, సరిగ్గా ఏడవలేకపోవడం, పీల్చడం, మింగడంలో ఇబ్బందులు పడతారు. శ్వాస తీసుకోవడంలో కూడా కష్టం కలగవచ్చు. ఇది ఒక వైద్య అత్యవసర పరిస్థితి. సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాంతకం కావచ్చు. ఈ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా తేనెలో చాలా తక్కువ పరిమాణంలో ఉన్నప్పటికీ, పిల్లలకు అది కూడా ప్రమాదకరమే అంటున్నారు నిపుణులు.
News January 6, 2026
HUDCOలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఢిల్లీలోని <


