News October 21, 2024
22న వయనాడ్లో సోనియా గాంధీ ప్రచారం

కేరళలోని వయనాడ్ ఉపఎన్నిక బరిలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నిలిచిన సంగతి తెలిసిందే. ప్రత్యక్ష రాజకీయాల్లో అరంగేట్రం చేయబోతున్న తన కూతురు ప్రియాంక కోసం పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీ ప్రచారం చేయనున్నారు. OCT 22న జరిగే రోడ్ షోలో రాహుల్, ప్రియాంకతో కలిసి ఆమె పాల్గొంటారు. కాగా కేరళలోని పాలక్కాడ్, చెలక్కర అసెంబ్లీ, వయనాడ్ MP స్థానాలకు NOV 13న పోలింగ్, 23న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
Similar News
News November 8, 2025
వాట్సాప్లో క్రాస్ ప్లాట్ఫామ్ మెసేజింగ్ ఫీచర్!

వాట్సాప్ క్రాస్ ప్లాట్ఫామ్ అనే కొత్త ఫీచర్ తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో యూజర్లు ఇతర మెసేజింగ్ యాప్స్ నుంచి వాట్సాప్కు మెసేజ్ చేయొచ్చు. వీడియోలు, ఫొటోలు, డాక్యుమెంట్స్, వాయిస్ నోట్స్ వంటి ఫైళ్లను థర్డ్ పార్టీ యాప్స్కు పంపొచ్చు. అయితే స్టేటస్లు, డిసప్పియరింగ్ మెసేజులు, స్టిక్కర్లు అందుబాటులో ఉండవు. ఇది టెస్టింగ్ దశలో ఉందని, వచ్చే ఏడాది అందుబాటులోకి రావొచ్చని ‘వాబీటా ఇన్ఫో’ పేర్కొంది.
News November 8, 2025
ప్రపంచంలో అత్యంత ఖరీదైన బియ్యం.. కిలో ఎంతంటే..

ప్రపంచంలో అత్యంత ఖరీదైన బియ్యాన్ని జపాన్ ఉత్పత్తి చేస్తోంది. ‘కిన్మెమై ప్రీమియం’ రకం బియ్యం ధర KG ₹12,500 పలుకుతోంది. 2016లో 840 గ్రా.కు ₹5,490 ధరతో ఖరీదైన బియ్యంగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కడం గమనార్హం. ప్రపంచంలోనే విలువైన, ఉత్తమమైన ధాన్యాలు, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, ప్రాసెసింగ్ వల్ల వీటికి ఇంత విలువ. వడ్లను వివిధ దశల్లో బియ్యంగా మారుస్తారు. కడగాల్సిన అవసరం లేకుండానే వండుకోగలగడం మరో స్పెషాలిటీ.
News November 8, 2025
అరుదైన రికార్డుకు అడుగు దూరంలో బుమ్రా

టీమ్ ఇండియా స్టార్ బౌలర్ బుమ్రా అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ఉన్నారు. మరో వికెట్ తీస్తే మూడు ఫార్మాట్లలో 100కు పైగా వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా నిలవనున్నారు. అలాగే టీ20ల్లో 100 వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్ కానున్నారు. 50 టెస్టుల్లో 226, 89 వన్డేల్లో 149, 79 టీ20ల్లో 99 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు. కాగా ఆసీస్, ఇండియా మధ్య చివరిదైన ఐదో టీ20 రేపు జరగనుంది.


