News September 11, 2025
సోనియా గాంధీకి కోర్టులో ఊరట

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. భారత సిటిజన్ అవ్వకముందే ఆమె ఓటు హక్కు పొందారని, విచారణ జరపాలని న్యాయవాది వికాస్ త్రిపాఠి పిటిషన్ దాఖలు చేశారు. ‘1980లో సోనియా ఓటు హక్కు పొందారు. ఆ తర్వాత 1982లో ఎన్నికల సంఘం దాన్ని తొలగించింది. అంటే ఆమె అక్రమంగా ఓటర్ ఐడీ పొందారని స్పష్టమవుతోంది’ అని అందులో పేర్కొన్నారు. దీనిపై విచారించిన కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసింది.
Similar News
News April 11, 2026
వేసవిలో అలోవెరా జ్యూస్ తాగితే..

వేసవిలో అలోవెరా జ్యూస్ తాగితే శరీరానికి చలువ చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ‘ఇది శరీర వేడిని తగ్గించి హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. పరగడుపున తాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది. షుగర్ కంట్రోల్ అవుతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది’ అని అంటున్నారు. ‘రోజుకు 50-120ml మాత్రమే తీసుకోవాలి. జెల్‌ను నీటితో కడిగి మిక్సీలో వేసి నీరు, నిమ్మరసం/తేనె కలుపుకోవాలి’ అని సూచిస్తున్నారు.
News April 11, 2026
350 బ్యాంక్ ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఇండియన్ బ్యాంక్ 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఐటీ, ఫైనాన్స్, మార్కెటింగ్, క్రెడిట్, రిస్క్, HRలో అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మేనేజర్ లాంటి ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్‌తో భర్తీ చేయనున్నారు. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. చివరి తేదీ ఏప్రిల్ 28. బీటెక్, MCA, MBA, CA, ఏదైనా పీజీ చేసి ఉండాలి. మరిన్ని వివరాలకు https://indianbank.bank.in/career/ చూడండి.
News April 11, 2026
ChatGPT సృష్టికర్త ఆల్ట్‌మన్ ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి

చాట్‌జీపీటీని క్రియేట్ చేసిన OpenAI CEO సామ్ ఆల్ట్‌మన్ ఇంటిపై పెట్రోల్ బాంబుతో దాడి జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఓ యువకుడు ఆయన నివాసంపై దాడి చేసి ఆఫీసును తగులబెడతానని బెదిరించాడు. పోలీసులు నిందితుణ్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. తన ఫ్యామిలీ సేఫ్టీపై ఆందోళన వ్యక్తం చేసిన ఆల్ట్‌మన్ AI పట్ల పెరుగుతున్న వ్యతిరేకత, తనపై వస్తున్న విమర్శలే ఈ దాడులకు కారణమని ఆవేదన వ్యక్తం చేశారు.


