News December 27, 2024

మన్మోహన్‌ను ప్రధాని చేసిన సోనియా గాంధీ

image

కాంగ్రెస్ నేతృత్వంలోని UPA 2004లో అధికారంలోకి రావడంతో సోనియా ప్రధాని అవుతారని వార్తలు వచ్చాయి. విదేశీయురాలనే కారణంతో సుష్మా స్వరాజ్, ములాయం సింగ్ యాదవ్, శరద్ పవార్ తదితర సీనియర్ నేతలు ఆమె నాయకత్వాన్ని వ్యతిరేకించారు. దీంతో సోనియా అనూహ్యంగా మన్మోహన్‌కు ప్రధాని పగ్గాలు అప్పగించారు. 2009లో రెండోసారి కూడా ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం కాకుండా సింగ్‌కే అవకాశం ఇచ్చారు. 2014లో ఓడినా ఆయన్ను ఎవరూ నిందించలేదు.

Similar News

News January 12, 2026

నేటి ముఖ్యాంశాలు

image

✹ ఇండియా ధైర్యానికి సజీవ సాక్ష్యమే సోమనాథ్: మోదీ
✹ AP: రూ.1750 కోట్లతో NTR విగ్రహం: నారాయణ
✹ గోదావరి వృథా జలాలు వాడుకుంటే తప్పేంటి: మంత్రి నిమ్మల
✹ TG: ధరణి లావాదేవీలపై రాష్ట్రవ్యాప్తంగా ఆడిటింగ్: పొంగులేటి
✹ సినిమా టికెట్ల రేట్లపై కమీషన్ల దందా: హరీశ్ రావు
✹ న్యూజిలాండ్‌పై తొలి వన్డేలో భారత్ విజయం

News January 12, 2026

ఢిల్లీపై గుజరాత్ సూపర్ విక్టరీ

image

WPL-2026: ఢిల్లీతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచులో గుజరాత్‌ విజయం సాధించింది. 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ 205 రన్స్ చేసింది. చివరి ఓవర్లో DC 7 పరుగులు చేయాల్సి ఉండగా సోఫీ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అద్భుతంగా బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీసి 2 రన్స్ మాత్రమే ఇచ్చారు. 18, 19వ ఓవర్లలో జెమీమా సేన 41 రన్స్ చేసినా ప్రయోజనం లేకపోయింది. ఇది గుజరాత్‌కు రెండో విజయం.

News January 12, 2026

దేశానికి మోదీనే రక్షణ గోడ: ముకేశ్ అంబానీ

image

ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్నా PM మోదీ వల్ల ఇండియా సురక్షితంగా ఉందని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ అన్నారు. ఈ సవాళ్లు భారత ప్రజలను ఇబ్బందిపెట్టలేవని, ఎందుకంటే నరేంద్ర మోదీ అనే అజేయ రక్షణ గోడ ఉందని కొనియాడారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పుడు చూస్తున్న ఆశ, ఆత్మవిశ్వాసం, ఉత్సాహాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో గుజరాత్‌లో ₹7 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు.