News June 8, 2024

సీపీపీ ఛైర్‌పర్సన్‌గా సోనియా ఏకగ్రీవం

image

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్ పర్సన్‌గా సోనియా గాంధీ మరోసారి ఎన్నికయ్యారు. పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో జరిగిన సమావేశంలో ఎంపీలు ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీపీపీ ఛైర్‌పర్సన్‌గా ఆమె పేరుతో పాటు గౌరవ్ గొగోయ్, తారిఖ్ అన్వర్, సుదర్శన్ పేర్లను నేతలు ప్రతిపాదించారు. ఈ క్రమంలో నేతలంతా సోనియావైపు మొగ్గుచూపారు.

Similar News

News September 12, 2025

2, 3 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీలు రన్ అవుతాయి: సీఎం

image

AP: మెడికల్ కాలేజీల PPP విధానంపై సీఎం చంద్రబాబు స్పందించారు. ‘జగన్ ఐదేళ్లలో ఎన్ని కాలేజీలు కట్టారు? కట్టకపోయినా కట్టానని ప్రచారం చేసుకున్నారు. మేము PPP విధానం తెచ్చినా కాలేజీలు గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే రన్ అవుతాయి. ఓపీ ఫ్రీగా ఉంటుంది. రెండు, మూడేళ్లలో 17 మెడికల్ కాలేజీలు ఆపరేట్ అవుతాయి. ఓపెన్ కాంపిటీషన్‌లో వచ్చే సీట్లు కూడా ముందు కంటే ఎక్కువగా ఉంటాయి’ అని Way2News కాన్‌క్లేవ్‌లో తెలిపారు.

News September 12, 2025

భార్యాభర్తలు మొబైల్‌ను వదిలి ఉండలేరేమో: చంద్రబాబు

image

AP: ఫోన్ల వాడకంపై CM చంద్రబాబు ఛలోక్తులు విసిరారు. ఒకప్పుడు తాను ప్రతి ఒక్కరికీ మొబైల్ అంటే నవ్వేవారని గుర్తుచేశారు. ‘ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. భార్యను వదిలి భర్త, భర్తను వదిలి భార్య కాసేపైనా ఉంటారేమో గానీ సెల్‌ఫోన్ వదిలి ఉండలేకపోతున్నారు(నవ్వుతూ). టెలికం విప్లవంపై అప్పటి PM వాజ్‌పేయీ, FM మాత్రమే నా విజన్ అర్థం చేసుకున్నారు’ అని Way2News కాన్‌క్లేవ్‌లో తెలిపారు.

News September 12, 2025

బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం ఏమన్నారంటే?

image

AP: భవిష్యత్తు కోసమే పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును తలపెట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘నీళ్లు ఉంటేనే సుస్థిర అభివృద్ధి సాధ్యం అవుతుంది. రాయలసీమకు నీళ్లు ఇస్తే దేశంలోనే నం.1గా మారుతుంది. గోదావరిలో పైన ఉండే నీటిని తెలంగాణ వాడుకోవచ్చు. మేము సముద్రంలోకి వెళ్తోన్న నీటినే వాడుకుంటాం. అందుకే బనకచర్ల కట్టాలని ప్రతిపాదించాం’ అని వే2న్యూస్ కాన్‌క్లేవ్‌లో చెప్పారు.