News May 6, 2024

మరికొద్ది రోజుల్లో కొడుకు పుట్టినరోజు.. ఇంతలోనే..

image

జమ్మూకశ్మీర్ పూంఛ్‌లో IAF వాహనంపై జరిగిన ఉగ్రవాదుల దాడిలో కార్పొరల్ విక్కీ పహాడే (33) మృతిచెందడంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. ‘జూన్ 7న తన ఐదేళ్ల కుమారుడి పుట్టినరోజును ఘనంగా జరిపేందుకు విక్కీ ప్లాన్ చేస్తున్నారు. ఇంతలోనే ఈ విషాదం జరిగింది. ఇప్పుడు ఆయన అంత్యక్రియలు చేయాల్సి వస్తోంది’ అని కుటుంబసభ్యులు వాపోయారు. కాగా చివరగా రెండు వారాల క్రితం విక్కీ తన సోదరి పెళ్లికి హాజరయ్యారు.

Similar News

News December 29, 2024

సీఎం రేవంత్‌కు హరీశ్ బహిరంగ లేఖ

image

TG: కంది రైతులకిచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి హరీశ్ రావు CM రేవంత్‌కి లేఖ రాశారు. ‘మేనిఫిస్టోలో, వరంగల్ రైతు డిక్లరేషన్‌లో కందులకు మద్దతు ధరతో పాటు అదనంగా రూ.400 బోనస్ చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు వాటి ఊసు లేదు. రైతులు ప్రతి క్వింటాలు కందులకు రూ.800 నష్టపోతున్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాల్ని ఏర్పాటు చేసి, మద్దతుధరను రైతులకు ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు.

News December 29, 2024

నితీశ్ ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి: గవాస్కర్

image

తాను ఎక్కడి నుంచి వచ్చానన్న సంగతిని నితీశ్ కుమార్ రెడ్డి ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలని క్రికెట్ దిగ్గజం గవాస్కర్ సూచించారు. ‘ఇది నితీశ్‌కు తొలి సెంచరీ. మున్ముందు ఇలాంటి మరెన్నో సాధిస్తారు. భారత క్రికెట్‌కు ఇప్పుడు అతనో స్టార్. కానీ ఎప్పుడూ క్రికెట్‌ను తేలిగ్గా తీసుకోకూడదు. కుటుంబం తన కోసం చేసిన త్యాగాలను మరచిపోకూడదు. మూలాల్ని మరచిపోకుండా ఉంటే అతడికి ఉజ్వలమైన కెరీర్ ముందుంది’ అని పేర్కొన్నారు.

News December 29, 2024

మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి: మల్లు రవి

image

దివంగత మాజీ పీఎం మన్మోహన్ సింగ్‌కు భారత దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ను ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి డిమాండ్ చేశారు. ‘మన్మోహన్ మృతి మన దేశానికి తీరని లోటు. ఆయన సంస్కరణలే దేశాన్ని అభివృద్ధివైపు పరుగులు పెట్టించాయి. దేశం ఓ మహానేతను కోల్పోయింది. ఆయన సేవలకు ‘భారతరత్న’ ఇవ్వాలి’ అని పేర్కొన్నారు.