News August 15, 2024
కొడుకు రూ.2.40 కోట్ల అప్పు.. తీర్చలేక పేరెంట్స్ ఆత్మహత్య

AP: ఒక్కగానొక్క కొడుకని అల్లారుముద్దుగా పెంచినందుకు తన వ్యసనాలతో తల్లిదండ్రుల ఉసురుతీసి రుణం తీర్చుకున్నాడో దుర్మార్గుడు. నంద్యాల(D) అబ్దుల్లాపురానికి చెందిన మహేశ్వర్, ప్రశాంతి దంపతుల కొడుకు నిఖిల్. డిగ్రీ కోసం బెంగళూరుకు పంపితే బెట్టింగులకు బానిసై ₹2.40 కోట్ల అప్పు చేశాడు. పేరెంట్స్ 10 ఎకరాల భూమి, ఇల్లు అమ్మేసినా అప్పు తీరలేదు. రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో పురుగు మందు తాగి సూసైడ్ చేసుకున్నారు.
Similar News
News July 6, 2025
రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్లు ఎన్నంటే?

TG: రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్ల సంఖ్యను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మొత్తం 171 కాలేజీల్లో 1,07,218 సీట్లు ఉన్నట్లు పేర్కొంది. కన్వీనర్ కోటాలో 70శాతం సీట్లు ఉండగా 76,795 సీట్లను ఈ కోటాలో భర్తీ చేయనుంది. ఈ నెల 8తో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి కానుంది. ఇవాళ్టి నుంచి ఈ నెల 10 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చింది.
News July 6, 2025
జింబాబ్వేతో మ్యాచ్.. ముల్డర్ డబుల్ సెంచరీ

జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికా కెప్టెన్ వియాన్ ముల్డర్ (264*) డబుల్ సెంచరీతో విజృంభించారు. 259 బంతులు ఎదుర్కొని 34 ఫోర్లు, 3 సిక్సర్లతో డబుల్ సెంచరీ పూర్తి చేసుకుని ట్రిపుల్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నారు. ఆట తొలి రోజే ముల్డర్ డబుల్ సెంచరీ బాదడం విశేషం. కాగా ముల్డర్ ఐపీఎల్లో SRHకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకే ఒక మ్యాచ్ ఆడి 9 రన్స్ చేశారు.
News July 6, 2025
అదరగొట్టిన ఆకాశ్‌దీప్

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్సులో భారత బౌలర్ ఆకాశ్‌దీప్ సత్తా చాటారు. 5 వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. తన కెరీర్లో ఒక ఇన్నింగ్సులో ఐదు వికెట్లు తీయడం ఇదే తొలిసారి. డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్మిత్ లాంటి స్టార్ బ్యాటర్లను ఔట్ చేయడం విశేషం.