News February 7, 2025

కలియుగ శ్రవణ కుమారులు!

image

తల్లిదండ్రులను కావడిపై మోస్తూ ఎన్నో ప్రాంతాలు తిరిగి ప్రాణాలు సైతం కోల్పోయిన శ్రవణ కుమారుడు ఎందరికో ఆదర్శం. అలాంటి ఇద్దరు అన్నదమ్ములు మహాకుంభమేళాలో కనిపించారు. తమ తల్లిదండ్రులను చెరో వైపు కూర్చోబెట్టుకుని శ్రవణ కుమారుడి తరహాలో కావడిపై మోశారు. వయసైపోయిన తల్లిదండ్రులను ఓల్డేజ్ హోమ్‌లో ఉంచుతున్న ఈ రోజుల్లో ఇలా వారికి సేవ చేయడం గొప్ప విషయమని నెటిజన్లు కొనియాడుతున్నారు. మీరేమంటారు?

Similar News

News November 20, 2025

పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి

image

AP: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు రాష్ట్రపతికి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. రాత్రికి తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో ఆమె బస చేయనున్నారు. రేపు ఉదయం రాష్ట్రపతి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. తిరుపతి పర్యటన ముగిసిన తర్వాత హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లనున్నారు.

News November 20, 2025

‘జనజీవన స్రవంతి’ అంటే ఏంటంటే?

image

మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారు అనే వార్తలు వింటుంటాం. ‘జనజీవన స్రవంతి’ అంటే సమాజంలో శాంతియుతంగా, చట్టబద్ధంగా జీవించడం. మావోయిస్టులు హింస, ఆయుధాలు & రహస్య జీవితాన్ని విడిచిపెట్టి, సాధారణ పౌరులుగా మారారని అర్థం. వారు ప్రభుత్వ పునరావాస పథకాలను ఉపయోగించుకుని, చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, విద్య, ఉద్యోగం వంటి ఉత్పాదక కార్యకలాపాల్లో పాల్గొనడాన్ని ఇది సూచిస్తుంది.

News November 20, 2025

పంచాయతీ ఎన్నికలపై కీలక సమీక్ష

image

TG: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. CS రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఇతర అధికారులతో సమీక్షించారు. స్థానిక ఎన్నికలను సమర్థంగా నిర్వహించాలని ఆమె ఆదేశించారు. కాగా మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల 11, 14, 17న ఎలక్షన్స్ జరుగుతాయని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.