News August 31, 2024
పుత్రోత్సాహం: PHOTO OF THE DAY

శ్రీలంకతో రెండో టెస్టు 2 ఇన్నింగ్సుల్లోనూ ENG బ్యాటర్ జో రూట్ సెంచరీలు(103, 143) చేశారు. డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తుండగా అతడిని తండ్రి మాట్ రూట్ ఆప్యాయంగా హత్తుకున్నారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. PHOTO OF THE DAY అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ENG తరఫున టెస్టుల్లో అత్యధిక శతకాలు(34), యాక్టీవ్ క్రికెటర్లలో మోస్ట్ టెస్టు సెంచరీలు చేసిన ఆటగాడిగా రూట్ రికార్డు సృష్టించారు.
Similar News
News March 12, 2025
పాకిస్థాన్ క్రికెట్ ICUలో ఉంది: అఫ్రీది

సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే పాకిస్థాన్ క్రికెట్ ఇప్పుడు ICUలో ఉందని మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది అన్నారు. ‘PCB నిర్ణయాల్లో కంటిన్యుటీ, కన్సిస్టెన్సీ ఉండట్లేదు. తరచుగా కెప్టెన్, కోచ్‌లను మారుస్తున్నారు. కోచ్‌లు ప్లేయర్లను నిందించడం, మేనేజ్మెంట్ స్టాఫ్ తమ పదవుల్ని కాపాడుకునేందుకు కోచ్‌లు, ఆటగాళ్లను నిందించడం విచారకరం’ అని బోర్డు పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
News March 12, 2025
వచ్చే నెల అమరావతికి ప్రధాని మోదీ!

AP: రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో రాజధాని అమరావతి పనులను పున:ప్రారంభించనుంది. ఈ కార్యక్రమానికి రావాలని ప్రధాని మోదీని ఆహ్వానించగా ఆయన అంగీకరించినట్లు సమాచారం. త్వరలో ప్రధాని కార్యాలయం అమరావతి పర్యటన తేదీని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, రాజధాని పనులను అట్టహాసంగా మళ్లీ స్టార్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 9ఏళ్ల కిందట అమరావతి పనులకు మోదీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.
News March 12, 2025
ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్

AP: ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వేతన బకాయిలను మరో 2 రోజుల్లో విడుదల చేయనున్నట్లు వివరించింది. అలాగే, మెటీరియల్ నిధులతో చేపట్టిన పనుల పెండింగ్ బిల్లులనూ 10 రోజుల్లో చెల్లిస్తామంది. ఈ రెండింటికీ సంబంధించి రూ.2వేల కోట్ల బకాయిలు ఉండటంతో రాష్ట్ర ఉన్నతాధికారి ఢిల్లీ వెళ్లి కేంద్ర ఉన్నతాధికారులను కలిశారు. దీంతో సానుకూలంగా స్పందించిన వారు నిధులు విడుదల చేస్తామని చెప్పారు.