News July 23, 2024
త్వరలో 1500 మంది టీచర్లకు పదోన్నతులు?

TG: రాష్ట్రంలో మిగిలిన ఉపాధ్యాయ పోస్టులను కూడా పదోన్నతులతో భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఖాళీలకు సంబంధించి జిల్లాలు, సబ్జెక్టుల వారీగా జాబితాను రూపొందించమని డీఈవోలను విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1500 ఖాళీలు ఉన్నట్లు అంచనా. అంటే అంతమందికీ ప్రమోషన్లు వస్తాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఇటీవల 19వేల మంది టీచర్లకు సర్కార్ పదోన్నతులు కల్పించింది.
Similar News
News November 19, 2025
రాష్ట్రంలో 324 ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్

TG: రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో ఖాళీగా ఉన్న 324 ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని ఈవోలకు దేవదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఈవోలు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే ఆలయాల వారీగా రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.
News November 19, 2025
హిందూ మహిళలకు సుప్రీంకోర్టు కీలక సూచన

మరణానంతరం తన ఆస్తిని ఎవరికి పంచాలో హిందూ మహిళలు వీలునామా రాసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. మహిళ చనిపోయాక ఆస్తుల విషయంలో పుట్టింటి, అత్తింటి వారికి వివాదాలు వస్తున్నాయని పేర్కొంది. వారసత్వ చట్టంలోని కొన్ని నిబంధనలను సవాలు చేస్తూ ఒక మహిళ పిటిషన్ దాఖలు చేశారు. ఆ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ చట్టం ప్రకారం పిల్లలు లేని వితంతువు చనిపోతే ఆమె ఆస్తులు భర్త ఫ్యామిలీకి చెందుతాయి.
News November 19, 2025
ఇండియా-ఎ ఓటమి

సౌతాఫ్రికా-ఎతో జరిగిన 3వ అనధికారిక వన్డేలో భారత్-ఎ 73 రన్స్ తేడాతో ఓడిపోయింది. SA నిర్దేశించిన 326 రన్స్ టార్గెట్ను ఛేదించలేక 252 పరుగులకే ఆలౌట్ అయింది. భారత జట్టులో ఆయుష్ బదోని(66), ఇషాన్ కిషన్(53) మినహా ఎవరూ రాణించలేదు. రుతురాజ్ 25, అభిషేక్ 11, తిలక్ వర్మ 11, పరాగ్ 17 రన్స్కే ఔటై నిరాశపరిచారు. అంతకుమందు SA ఓపెనర్లు ప్రిటోరియస్(123), మూన్సమీ(107) సెంచరీలతో చెలరేగారు.


