News November 24, 2024

త్వరలో భారత్‌కు బ్రిటన్ ‘కింగ్’

image

బ్రిటన్ కింగ్ ఛార్లెస్-3 తన సతీమణి క్వీన్ కెమెల్లాతో కలిసి త్వరలో భారత్‌కు రానున్నారు. తన తల్లి క్వీన్ ఎలిజబెత్-2 మరణంతో 2022లో ఆయన ఇండియా టూర్ రద్దయింది. ఇప్పుడు INDతో పాటు పాక్, బంగ్లాలోనూ ఆయన పర్యటిస్తారు. ఈ ఏడాది క్యాన్సర్ చికిత్స తీసుకుంటూ కోలుకున్న ఆయన OCTలో ఆస్ట్రేలియా నుంచి బ్రిటన్‌కు తిరుగు ప్రయాణంలో బెంగళూరులోని ఓ వెల్‌సెస్ సెంటర్‌కి వెళ్లారు. ఇప్పుడు మరోసారి అక్కడికి వెళ్లే ఛాన్సుంది.

Similar News

News November 22, 2025

గుర్తులేదు.. మరిచిపోయా: ఐబొమ్మ రవి

image

TG: మూడో రోజు పోలీసుల విచారణలో ఐబొమ్మ రవి సమాధానాలు దాట వేసినట్లు తెలుస్తోంది. అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పాడట. బ్యాంకు ఖాతాల వివరాలపైనా నోరు విప్పలేదని సమాచారం. యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లు అడిగితే గుర్తులేదని, మరిచిపోయానని తెలిపినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఎథికల్‌ హ్యాకర్ల సాయంతో హార్డ్‌‌డిస్క్‌లు, పెన్‌‌డ్రైవ్‌లు ఓపెన్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

News November 22, 2025

ఇతిహాసాలు క్విజ్ – 74 సమాధానాలు

image

ప్రశ్న: విష్ణుమూర్తి ద్వార పలుకులు అయిన జయవిజయులు అసురులుగా ఎందుకు జన్మించారు?
సమాధానం: ఓసారి సనక సనందనాది మహర్షులు విష్ణు దర్శనానికి రాగా, వీరు వారిని లోపలికి అనుమతించలేదు. దీంతో కోపించిన మహర్షులు వారిని భూలోకంలో రాక్షసులుగా జన్మించమని శపించారు. వీరు 3 జన్మలలో (హిరణ్యాక్ష-హిరణ్యకశిప, రావణ-కుంభకర్ణ, శిశుపాల-దంతవక్ర) అసురులుగా పుట్టి, స్వామి చేతిలోనే మరణించి తిరిగి వైకుంఠం చేరారు.<<-se>>#Ithihasaluquiz<<>>

News November 22, 2025

GHMC నోటీసులపై రామానాయుడు స్టూడియోస్ క్లారిటీ

image

జీహెచ్ఎంసీ <<18346319>>నోటీసులపై<<>> రామానాయుడు స్టూడియోస్ స్పష్టత ఇచ్చింది. తాము వినియోగిస్తున్న స్థలాన్ని తక్కువగా చూపించట్లేదని ప్రకటనలో తెలిపింది. ఎప్పటి నుంచో 68,276 చదరపు అడుగులకు ఆస్తి పన్ను కడుతున్నట్లు వెల్లడించింది. జీహెచ్ఎంసీ నిర్దేశించిన ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించినట్లు పేర్కొంది. GHMC నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా నడుచుకుంటున్నట్లు స్పష్టం చేసింది.