News June 16, 2024
త్వరలో ‘డిజిటల్ ఇండియా బిల్లు’!

డీప్ ఫేక్ వీడియోలకు చెక్ పెట్టేందుకు కేంద్రం ‘డిజిటల్ ఇండియా బిల్లు’ను తీసుకురానున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. రానున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ముందుగా అన్ని పార్టీల నుంచి దీనిపై ఏకాభిప్రాయం తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. యూట్యూబ్ సహా వివిధ ఆన్లైన్ వేదికల్లో వీడియోల నియంత్రణకూ చట్టం తీసురానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Similar News
News November 5, 2025
CCRHలో 90 పోస్టులు

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (<
News November 5, 2025
భార్యాభర్తల మధ్య అనుబంధాల కోసం..

కార్తీక పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తే భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ వ్రతంలో భాగంగా మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రి పళ్లను బూరెలుగా, ఆకులను విస్తర్లుగా ఉపయోగించి పూజించడం సంప్రదాయం. నేడు శివాలయంలో దీపారాధన చేయడం వల్ల ముక్కోటి దేవతల పూజాఫలం, పుణ్య నదులలో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని, ఇహపరలోకాలలో సుఖసౌఖ్యాలు, ముక్తి లభిస్తాయని పండితులు అంటున్నారు.
News November 5, 2025
మిరపలో కుకుంబర్ మొజాయిక్ తెగులను ఎలా నివారించాలి?

మిరప పంటను ఆశించే ఈ వైరస్ తెగులు పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు సోకిన మొక్కల్లో ఎదుగుదల లోపిస్తుంది. మొక్కలు పొట్టిగా కనిపిస్తాయి. ఆకులు రంగుమారిపోతాయి. మొక్కలకు పూత ఉండదు. ఈ వైరస్ సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. వ్యాధిని వ్యాప్తి చేసే పేనుబంక నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25mlను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.


