News June 11, 2024
కాసేపట్లో EAPCET ఫలితాలు.. Way2Newsలో వేగంగా..

AP: EAPCET ఫలితాలు సా.4 గంటలకు విడుదల కానున్నాయి. EAPCET అధికారిక సైట్‌తో పాటు Way2News యాప్‌లోనూ ఫలితాలు పొందవచ్చు. మిగతా ప్లాట్‌ఫాంల తరహాలో విసిగించే యాడ్స్, లోడింగ్ సమస్యలు మన యాప్‌లో ఉండవు. ప్రత్యేక స్క్రీన్‌లో హాల్‌టికెట్ నంబర్ ఇచ్చి క్లిక్ చేస్తే మెరుపు వేగంతో ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత వాట్సాప్ సహా ఏ ప్లాట్‌ఫాంకైనా రిజల్ట్‌ను ఒక్క క్లిక్‌తో సులభంగా షేర్ చేసుకోవచ్చు.
Similar News
News December 13, 2025
గర్భాశయం ఉంటేనే మహిళ: మస్క్

హ్యూమన్ జెండర్‌పై ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ షాకింగ్ ట్వీట్ చేశారు. ‘మీకు గర్భాశయం ఉంటే మీరు మహిళ అవుతారు. లేదంటే కాదు’ అని ట్వీట్ చేశారు. ఆయన మొదటి నుంచి హ్యూమన్ జెండర్ విషయంలో ఈ తరహాలోనే స్పందిస్తున్న విషయం తెలిసిందే. ‘మనుషుల్లో స్త్రీ, పురుషులు మాత్రమే ఉంటారు’ అని చెప్తూ ఉంటారు. LGBT వర్గాలను ఆయన మొదటి నుంచీ వ్యతిరేకిస్తూనే వస్తున్నారు.
News December 13, 2025
సాదా బైనామాలకు అఫిడవిట్లు తప్పనిసరి

TG: సాదా బైనామా భూముల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తుతోపాటు అఫిడవిట్లు దాఖలు చేయాలని రెవెన్యూ అధికారులు స్పష్టం చేస్తున్నారు. భూ హక్కులపై వివాదాల దృష్ట్యా అఫిడవిట్లు ఉంటేనే అనుమతిస్తున్నారు. వివాదాలు తలెత్తినప్పుడు భూ హక్కులకోసం ఇచ్చే దరఖాస్తుల ధ్రువీకరణ నిలిపివేయాలని ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 9.26 లక్షల దరఖాస్తులు రాగా వివాదాల వల్ల 10 శాతం ధ్రువీకరణా పూర్తికాలేదు.
News December 13, 2025
Stay Safe: రేపు, ఎల్లుండి కోల్డ్ వేవ్స్

తెలంగాణలో రేపు, ఎల్లుండి చలి తీవ్రత మరింత పెరగనుందని IMD తెలిపింది. కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోనూ తీవ్రమైన శీతలగాలులు వీస్తాయని పేర్కొంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయంది. TGలో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ఉదయం, రాత్రి వేళల్లో ప్రజలు బయటికి రావద్దని హెచ్చరించింది.


