News October 8, 2024

విద్యుత్ శాఖలో ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్: భట్టి

image

TG: విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి త్వరలో భారీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తామన్నారు. ఇప్పటికే పదేళ్లుగా నిలిచిన పదోన్నతులను పూర్తి చేశామని చెప్పారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి 1912కు ఫోన్ చేయాలని ప్రజలకు సూచించారు.

Similar News

News April 2, 2026

ట్రంప్ ప్రకటన.. భారీగా పెరిగిన క్రూడాయిల్ ధర

image

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ <<19543167>>ప్రకటన<<>> నేపథ్యంలో క్రూడాయిల్ ధర భగ్గుమంది. బ్రెంట్ క్రూడ్ ధర 4 శాతం పెరిగి 105 డాలర్లకు చేరింది. అలాగే WTI బ్యారెల్ చమురు రేట్ 3 శాతం ఎగసి 103 డాలర్లుగా ఉంది. ఇక ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లాయి. ఈ ప్రభావంతో భారత మార్కెట్లు కూడా నష్టపోయే ఛాన్స్ ఉంది. అటు బంగారం, వెండి ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది.

News April 2, 2026

నాగ్.. 25 నుంచి 60ఏళ్ల వరకు!

image

తన 100వ సినిమాపై నటుడు నాగార్జున ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ మూవీలో తాను 25 నుంచి 60ఏళ్ల వయస్సు వరకు పలు గెటప్స్‌లో కనిపించనున్నట్లు తెలిపారు. యువకుడిగా కనిపించడానికి డీ-ఏజింగ్ టెక్నిక్ వాడుతున్నామన్నారు. తండ్రి-కూతుళ్ల మధ్య ఉండే సెంటిమెంట్ చుట్టూ కథ ఉంటుందని వెల్లడించారు. తమిళ డైరెక్టర్ RA కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ మూవీకి కింగ్ 100, లాటరీ కింగ్ తదితర పేర్లు పరిశీలిస్తున్నారు.

News April 2, 2026

ఇటలీకి హ్యాట్రిక్ షాక్!

image

ఫుట్‌బాల్ ప్రపంచకప్ హిస్టరీలో నాలుగుసార్లు (1932, 1938, 1982, 2006) ఛాంపియన్‌గా నిలిచిన ఇటలీ ఇప్పుడు క్వాలిఫికేషన్‌కే తడబడుతోంది. 2018, 2022తో పాటు ఇప్పుడు లేటెస్ట్‌గా మరోసారి ఆ జట్టు అర్హతను సాధించలేకపోయింది. ప్రత్యర్థి బోస్నియాను తక్కువ అంచనా వేసిందనే విమర్శలు ఎదుర్కొంటోంది. ఇక ఇతర స్టార్ జట్లు చిలీ, పోలాండ్, నైజీరియా, కోస్టారికా కూడా అర్హత సాధించలేకపోయాయి. JUN 11 నుంచి WC ప్రారంభంకానుంది.