News December 4, 2024

కాసేపట్లో ‘పుష్ప-2’ పబ్లిక్ టాక్

image

వరల్డ్ మోస్ట్ అవైటెడ్ సినిమా ‘పుష్ప-2’ ప్రీమియర్స్ మొదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు థియేటర్లలో సినిమాను వీక్షిస్తున్నారు. ‘పుష్ప’ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. దీంతో సినిమా ఎలా ఉంటుంది? అల్లు అర్జున్ నటవిశ్వరూపం చూపిస్తారా? పుష్ప కంటే పుష్ప-2లో సుకుమార్ అంతకుమించి ఏం చూపించారు? అనే విషయాలపై ఆసక్తి నెలకొంది. మరికాసేపట్లో WAY2NEWS పబ్లిక్ టాక్. STAY TUNED.

Similar News

News December 5, 2024

నేడు టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

image

AP: ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఇవాళ జరగనుంది. ఈ ఎన్నికల్లో 16,737 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 116 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఈ నెల 9న ఓట్ల లెక్కింపు చేపడతారు. కాగా యూటీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే.

News December 5, 2024

మంచు దుప్పటిలా మారిన లార్డ్స్ స్టేడియం

image

క్రికెట్ మక్కాగా పిలుచుకునే లార్డ్స్ మైదానం మంచుతో నిండిపోయింది. మైదానం మొత్తం మంచు దుప్పటి పరచినట్లుగా మారింది. దీంతో స్టేడియం అందాలు రెట్టింపు అయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా క్రిస్మస్‌కు ముందు ఇంగ్లండ్‌లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో మంచు కూడా అధికంగా పడుతుంటుంది.

News December 5, 2024

నేడు ముంబైకి సీఎం చంద్రబాబు

image

AP: మహారాష్ట్ర సీఎం, మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు సీఎం చంద్రబాబు ఇవాళ ప్రత్యేక విమానంలో ముంబై వెళ్తున్నారు. ఎన్డీఏ నేతల ఆహ్వానం మేరకు ఆయన ఈ వేడుకలకు హాజరవుతున్నారు. రేపు, ఎల్లుండి విశాఖలో పర్యటిస్తారు. కాగా చంద్రబాబు పర్యటనల కో ఆర్డినేటర్‌గా మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్ నియమితులయ్యారు. గతంలో చంద్రబాబు ఎన్నికల పర్యటనలను కూడా ఈయనే చూసుకున్నారు.