News June 19, 2024
త్వరలో SBI లాంగ్ టర్మ్ బాండ్స్.. ₹20వేల కోట్లే టార్గెట్!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.20వేల కోట్లు సమకూర్చుకునేందుకు SBI లాంగ్ టర్మ్ బాండ్స్ మంజూరు చేయనుంది. పబ్లిక్ ఇష్యూ లేదా ప్రైవేట్ సెటిల్మెంట్ ద్వారా బాండ్లను విక్రయించనున్నట్లు సంస్థ వెల్లడించింది. కాగా ఈ జనవరిలో పర్పెచ్యువల్ బాండ్ల (మెచ్యూరిటీ డేట్ లేనివి) ద్వారా SBI ₹5వేలకోట్లు సేకరించింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్లతో మరో ₹10వేలకోట్లు సమకూర్చుడంపైనా SBI దృష్టిసారించింది.
Similar News
News December 3, 2025
ఓపెన్ కాని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వెబ్సైట్

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వెబ్సైట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఓపెన్ చేస్తే గేమింగ్ సైట్కు రీడైరెక్ట్ అవుతోందని అధికారులు వెల్లడించారు. సమస్యపై ఐటీ నిపుణులు పని చేస్తున్నారు. పూర్తిస్థాయి పునరుద్ధరణకు వారం రోజులు పట్టే అవకాశం ఉందని సైబర్ క్రైం డీసీపీ సుధీంద్ర తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News December 3, 2025
నాది కథను మలుపు తిప్పే రోల్: సంయుక్త

‘అఖండ-2’ అభిమానుల అంచనాలకు మించి ఉండబోతుందని హీరోయిన్ సంయుక్త మేనన్ అన్నారు. చిత్రంలో తన పాత్ర చాలా స్టైలిష్గా ఉంటుందని, కథను మలుపు తిప్పే రోల్ అని చెప్పారు. ఈ సినిమా ఛాన్స్ వచ్చినప్పుడు షెడ్యూల్ బిజీగా ఉన్నా డేట్స్ అడ్జస్ట్ చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం స్వయంభు, నారీ నారీ నడుమ మురారి చిత్రాల్లో నటిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా అఖండ-2 ఎల్లుండి థియేటర్లలో రిలీజ్ కానుంది.
News December 3, 2025
బంధం బలంగా ఉండాలంటే ఆర్థిక భద్రత ఉండాల్సిందే!

మానవ సంబంధాల బలోపేతానికి ఆర్థిక సంబంధాలు కీ రోల్ పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. జీవితంలో ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు, భావోద్వేగ మద్దతు, సామరస్యం చాలా ముఖ్యమని, కానీ వీటికి తోడు ఆర్థిక భద్రత ఉన్నప్పుడే అవి మరింత పటిష్టంగా ఉంటాయని సైకాలజీ టుడే, యూగోవ్ సంస్థలు నిర్వహించిన సర్వేలో తేలింది. ఆర్థిక భద్రత లేదా స్థిరత్వం లేకపోతే చాలా వరకు సంబంధాలు విచ్ఛిన్నం అయ్యే అవకాశం ఉంటుందని వెల్లడించింది.


