News October 10, 2024
త్వరలోనే వైసీపీ దుకాణం శాశ్వతంగా మూత: ఎమ్మెల్యే జీవీ

AP: మాజీ సీఎం జగన్ గుడ్ బుక్ రాస్తామంటున్నారని, ఆయన చేసిన పాపాలకు రామకోటి రాసుకుంటే పుణ్యం వస్తుందని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఎద్దేవా చేశారు. ఆయనకు కలలో కూడా లోకేశ్ రెడ్ బుక్కే తిరుగుతున్నట్లు ఉందని సెటైర్లు వేశారు. వైసీపీ పతనానికి కర్త, కర్మ, క్రియ జగనే అన్నారు. త్వరలోనే ఆ పార్టీ దుకాణం శాశ్వతంగా మూతపడటం ఖాయమని జోస్యం చెప్పారు.
Similar News
News November 21, 2025
భూపాలపల్లి: మెడికల్ ఆఫీసర్లతో డీఎంహెచ్‌వో సమావేశం

భూపాలపల్లిలో మెడికల్ ఆఫీసర్లతో డీఎంహెచ్‌వో మధుసూదహన్ ఈరోజు సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న ప్రతి ఆరోగ్య ఉపకేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఆరోగ్య కార్యకర్తలు వేసెక్టమీ క్యాంపు & మొబలైజేషన్‌కు సంబంధించిన విషయాలన్నీ ప్రజలకు తెలిపాలన్నారు. అత్యధికంగా ఎంఎస్సీ ఆపరేషన్లు అయ్యేటట్టు పురుషులను మోటివేషన్ చేయాలని తెలియజేశారు.
News November 21, 2025
రిజర్వేషన్ల ఖరారుకు మంత్రివర్గం ఆమోదం.. రేపే జీవో

TG: గ్రామ పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్ల విధివిధానాలు ఖరారు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ రేపు GO ఇవ్వనుంది. రిజర్వేషన్లు 50% మించకుండా కొత్త రిజర్వేషన్లను సిఫార్సు చేస్తూ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన <<18332519>>నివేదికను<<>> రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. మంత్రులకు ఫైలు పంపించి ఆమోదిస్తున్నట్లు సంతకాలు తీసుకున్నారు. దీంతో రిజర్వేషన్లపై రేపు జీవో రానుంది. అనంతరం ఎన్నికల షెడ్యూల్ వెలువడనుంది.
News November 21, 2025
సీఎస్ పదవీకాలం పొడిగింపు

ఏపీ సీఎస్ విజయానంద్ పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలాఖరుతో ఆయన పదవీకాలం ముగియనుండగా 3 నెలలు పొడిగించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీంతో 2026 ఫిబ్రవరి వరకు విజయానంద్ సీఎస్‌గా కొనసాగనున్నారు. అనంతరం సాయిప్రసాద్ బాధ్యతలు చేపట్టనున్నారు. అదే ఏడాది మేతో ఆయన పదవీకాలం కూడా ముగియనుంది.


