News December 1, 2024

చలికాలంలో గొంతు నొప్పా? చిట్కాలు!

image

చలికాలంలో గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని మార్గాలున్నాయి.
> వెచ్చని ఉప్పు నీటితో పుక్కిలించాలి.
> గొంతును తేమగా ఉంచడానికి చికెన్/టమాటా సూప్ తీసుకోవచ్చు.
> ఆల్కహాల్, కెఫిన్ కలిగిన పానీయాలు తీసుకోవద్దు.
> తులసి/తమలపాకు రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే ఉపశమనం ఉంటుంది
> చల్లటి వాతావరణంలో ఎక్కువగా తిరగడం మానేయాలి.

Similar News

News December 1, 2025

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత

image

తన ప్రియుడు, డైరెక్టర్ రాజ్ నిడిమోరును వివాహమాడినట్లు స్టార్ హీరోయిన్ సమంత ప్రకటించారు. ఇవాళ్టి డేట్‌, లవ్ ఎమోజీలతో పెళ్లి ఫొటోలను ఆమె ఇన్‌స్టాలో షేర్ చేశారు. కోయంబత్తూరు ఈషా ఫౌండేషన్‌లోని లింగ భైరవ ఆలయంలో తొలుత నిశ్చితార్థం చేసుకొని, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఉపాసన కొణిదెల, అనుపమతో పాటు తదితర సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

News December 1, 2025

హైదరాబాద్ NGRIలో ఉద్యోగాలు

image

HYDలోని CSIR-<>NGRI<<>> 14 ప్రాజెక్ట్ అసోసియేట్, Sr ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు DEC 9న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MSc/MSc(Tech)/M.Tech/MS/ఇంటిగ్రేటెడ్ M.Tech/PhD/GATE/NET ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు ప్రాజెక్ట్ అసోసియేట్‌కు 35ఏళ్లు, Sr ప్రాజెక్ట్ అసోసియేట్‌కు 40ఏళ్లు. వెబ్‌సైట్: https://www.ngri.res.in

News December 1, 2025

రెండో పెళ్లి చేసుకున్న సినీ ప్రముఖులు వీరే..

image

సినీ ఇండస్ట్రీలో విడాకులు, పలు కారణాలతో రెండో పెళ్లి చేసుకోవడం కామన్‌గా మారింది. రెండో పెళ్లి చేసుకున్న సినీ ప్రముఖుల జాబితాలో తాజాగా హీరోయిన్ <<18437680>>సమంత<<>> చేరారు. ఈ లిస్టులో సీనియర్ NTR, సూపర్ స్టార్ కృష్ణ, నాగార్జున, హరికృష్ణ, మోహన్ బాబు, మంచు మనోజ్, నాగ చైతన్య, అమలాపాల్, నిర్మాత దిల్ రాజు ఉన్నారు. పవన్ కళ్యాణ్, నటుడు నరేశ్, నటి రాధిక మూడో పెళ్లి చేసుకున్న వారి లిస్టులో ఉన్నారు.