News March 30, 2024
కేజ్రీవాల్ భార్యను కలిసిన సోరెన్ సతీమణి

లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ CM అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతను ఝార్ఖండ్ మాజీ CM హేమంత్ సోరెన్ భార్య కల్పన కలిశారు. కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో సునీతకు తన సానుభూతిని తెలిపారు. ఇటీవల మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్ను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత స్పందించిన కల్పన.. సునీత బాధను తాను అర్థం చేసుకోగలనంటూ మద్దతుగా నిలిచారు.
Similar News
News November 16, 2025
జాతీయ స్థాయికి వానపల్లి విద్యార్థిని

కొత్తపేట మండలం వానపల్లి జడ్పీ హైస్కూల్ విద్యార్థిని పలివెల లావణ్య టెన్నికాయిట్ పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. బాపట్ల జిల్లా చీరాలలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో విజయం సాధించి ఆమె ఈ అర్హత సాధించారు. ఈ విషయాన్ని హెచ్ఎం ముద్రగడ వెంకటేశ్వరరావు శనివారం వెల్లడించారు. ఈ నెల 26 నుంచి 30 వరకు జమ్మూ కశ్మీర్లో జరిగే జాతీయ పోటీల్లో లావణ్య పాల్గొననున్నారు.
News November 16, 2025
రేపే కార్తీక మాస చివరి సోమవారం.. ఇలా చేస్తే కోటి జన్మల పుణ్యం

రేపు కార్తీక మాసంలో చివరి సోమవారం. గత సోమవారాలు, పౌర్ణమి వేళ 365 వత్తుల దీపం వెలిగించని, దీపదానం చేయని వారు రేపు ఆ లోపాన్ని సరిదిద్దుకోవచ్చని పండితులు చెబుతున్నారు. ఈ ఒక్క రోజు శివారాధన కోటి సోమవారాల ఫలితాన్ని, కోటి జన్మల పుణ్యాన్ని ఇస్తుందని నమ్ముతారు. రేపు ప్రదోష కాలంలో ఆవు నెయ్యితో దీపారాధన చేసి, శివుడి గుడిలో దీపదానం చేస్తే శుభకరమని సూచిస్తున్నారు. మరిన్ని ఆధ్యాత్మిక కథనాల కోసం <<-se_10013>>భక్తి<<>>.
News November 16, 2025
నేడు నాన్ వెజ్ తినవచ్చా?

కార్తీక మాసంలో రేపు(చివరి సోమవారం) శివాలయాలకు వెళ్లేవారు, దీపారాధన, దీపదానం చేయువారు నేడు నాన్ వెజ్ తినకూడదని పండితులు సూచిస్తున్నారు. అది కడుపులోనే ఉండి రేపటి పూజకు అవసరమైన శరీర పవిత్రతను దెబ్బ తీస్తుందని అంటున్నారు. ‘మాంసాహారం రజోతమో గుణాలను ప్రేరేపించి, దైవారాధనలో ఆటంకం కలిగించవచ్చు. కాబట్టి శివానుగ్రహాన్ని పొందడానికి, పూజ ఫలం కలగడానికి నేడు సాత్విక ఆహారం స్వీకరించడం ఉత్తమం’ అంటున్నారు.


