News October 24, 2025
రబీలో జొన్న సాగు – అనువైన రకాలు

రబీ(యాసంగి)లో తేలికపాటి నీటి తడులకు అవకాశం ఉండే ప్రాంతాల్లో వరికి ప్రత్యామ్నాయంగా జొన్న పంటను రైతులు సాగు చేస్తున్నారు. తేమను నిలుపుకునే లోతైన నల్లరేగడి నేలలు, నీటి వసతి ఉండే ఎర్ర చల్కా నేలల్లో జొన్నను సాగు చేయవచ్చు. ఎకరాకు 3-4 కిలోల విత్తనం అవసరం. తాండూరు జొన్న-55, తాండూరు జొన్న-1, సి.యస్.వి 29 ఆర్, ఎన్.టి.జె-5, సి.యస్.హెచ్ 39 ఆర్, సి.యస్.హెచ్ 15 ఆర్ వంటి జొన్న రకాలు రబీ సాగుకు అనుకూలం.
Similar News
News October 25, 2025
లవ్ మ్యారేజ్ చేసుకుంటా: అనుపమ

కెరీర్ ప్రారంభంలో ట్రోల్స్ వల్ల తాను బాధపడినట్లు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చెప్పారు. బిగినింగ్‌లో ఓ స్కూల్ ఈవెంట్‌కి వెళ్లిన ఫొటోలు వైరలవ్వగా డబ్బులిస్తే పాన్ షాపు ఈవెంట్లకూ వెళ్తారని తనపై ట్రోల్స్ వచ్చినట్లు ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలిపారు. లవ్ మ్యారేజ్ చేసుకుంటారా అని ప్రశ్నించగా ఫ్యామిలీ అనుమతితో చేసుకుంటానని ఆమె బదులిచ్చారు. తాను ప్రత్యేకంగా ఎలాంటి డైట్ పాటించనని, నచ్చిన ఫుడ్ తింటానని చెప్పారు.
News October 25, 2025
1,149 పోస్టులు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 1,149 అప్రెంటిస్‌లకు దరఖాస్తు చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు NCVT/SCVT జారీ చేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి. వయసు 15 నుంచి 24ఏళ్లు. రిజర్వేషన్ గల వారికి వయోపరిమితిలో సడలింపు ఉంది. టెన్త్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://ecr.indianrailways.gov.in/
News October 25, 2025
నేడు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే..?

కుజ, కాల సర్ప దోషాలకు ఆదిదేవుడు సుబ్రహ్మణ్య స్వామి. అందుకే నాగుల చవితి రోజున ఆయనను ఆరాధించడం శుభకరమని పండితులు సూచిస్తారు. ఈ పర్వదినాన స్వామివారికి అభిషేకం చేసి, సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం ద్వారా దోషాలు తొలగి, ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయని అంటున్నారు. దేవాలయానికి వెళ్లలేనివారు ఇంట్లోనే ఆయనకు పూజలు చేస్తే.. పెళ్లి కానివారికి వివాహ యోగం, ఉద్యోగంలో అభివృద్ధి వంటి శుభాలు ప్రాప్తిస్తాయని అంటున్నారు.


