News December 31, 2024
క్షమించండి: CM న్యూఇయర్ సందేశం
జాతి ఘర్షణలతో అట్టుడికిన మణిపుర్ 2025లో సాధారణ స్థితికి రావాలని CM బీరేన్‌సింగ్ ఆకాంక్షించారు. అశాంతిపై ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ‘ఏడాదంతా దురదృష్టం వెంటాడింది. మే3 తర్వాతి పరిణామాలకు నన్ను క్షమించండి. చాలా మంది ఇళ్లు కోల్పోవడం బాధాకరం. జరిగిందేదో జరిగిపోయింది. గతాన్ని మన్నిస్తూ, తప్పుల్ని మర్చిపోయి ప్రశాంత మణిపుర్ కోసం కొత్త జీవితం ఆరంభించాలి. జాతులన్నీ కలిసిమెలిసి బతకాలి’ అని అన్నారు.
Similar News
News February 5, 2025
రేపు జగన్ ప్రెస్‌మీట్
AP: మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు కీలక ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడతారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, ప్రజా సమస్యలపై ఆయన ప్రసంగిస్తారు. కాగా ఇవాళ విజయవాడ కార్పొరేటర్లతో జరిగిన సమావేశంలో జగన్ కూటమి సర్కార్‌పై ఫైర్ అయ్యారు. ఈసారి జగనన్న 2.0 వేరే లెవెల్లో ఉంటుందని కూటమి సర్కార్‌ను ఆయన హెచ్చరించారు.
News February 5, 2025
పీవోకేలో అడుగుపెట్టిన హమాస్!
కశ్మీర్ సాలిడారిటీ డేలో పాల్గొనేందుకు పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు హమాస్ లీడర్ ఖలీద్ అల్ ఖదౌమీ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్‌లో జైషే (Jaish-e – జైషే) మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ సోదరుడు తల్హా సైఫ్‌తో కలిసి ఖలీద్ పాల్గొన్నట్లు సమాచారం. మరోవైపు జమ్మూ కశ్మీర్లో పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైలెవెల్ మీటింగ్ నిర్వహించారు. భద్రతా చర్యలు తీవ్రతరం చేయాలని ఆ రాష్ట్ర పోలీసులను ఆదేశించారు.
News February 5, 2025
హీరోయిన్ నోరా ఫతేహీ మృతి అంటూ వదంతులు.. క్లారిటీ
బంగీ జంప్ ప్రమాదంలో హీరోయిన్ నోరా ఫతేహీ మృతి చెందారంటూ వదంతులు వస్తున్నాయి. బంగీ జంప్ చేస్తుండగా రోప్ తెగి పైనుంచి కిందపడి మరణించారంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన ఆమె ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆ వీడియోలో ఉన్నది నోరా కాదని, ఆమె క్షేమంగానే ఉన్నట్లు నేషనల్ మీడియా తెలిపింది. గతంలో బంగీ జంప్ చేస్తూ చనిపోయిన మహిళకు బదులు నోరా ఫొటోను ఉపయోగించి ఫేక్ వీడియో సృష్టించారని పేర్కొంది.