News May 2, 2024
మోదీకి మద్దతిచ్చినందుకు క్షమించండి: ఠాక్రే

మహారాష్ట్రలోని శివసేన(UBT) అధినేత ఉద్ధవ్ ఠాక్రే రాష్ట్ర ప్రజలను క్షమాపణ కోరారు. గతంలో తాను ప్రధాని మోదీకి మద్దతిచ్చినందుకు ప్రజలంతా తనను క్షమించాలని అన్నారు. మోదీ ప్రభుత్వం మహారాష్ట్రకు ద్రోహం చేసిందని ఆయన ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన 2019 నాటి రోజులను ప్రస్తావించారు. అప్పుడు శివసేన, బీజేపీ కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే.
Similar News
News March 3, 2026
నటుడు శివాజీ రాజా తండ్రి కన్నుమూత

టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజా ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి రామరాజు(85) కన్నుమూశారు. వయోభారంతో పాటు అనారోగ్య కారణాలతో HYDలోని మధురానగర్ స్వగృహంలో ఈ ఉదయం చనిపోయారు. విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు శివాజీ రాజా ఇంటికి చేరుకొని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో రామరాజు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
News March 3, 2026
గుంటూరు జిల్లాలో 14 పోస్టులు… అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

గుంటూరు జిల్లా స్త్రీ&శిశు అభివృద్ధి సంస్థ వన్ స్టాప్ సెంటర్‌లో 14 కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. సెంటర్ అడ్మినిస్ట్రేటర్, కేస్ వర్కర్, పారా లీగల్ పర్సనల్, పారా మెడికల్ పర్సనల్, సైకో సోషల్ కౌన్సిలర్, ఆఫీస్ అసిస్టెంట్, MTS, సెక్యూరిటీ గార్డ్ పోస్టులు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు మార్చి 5 వరకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మెరిట్, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
News March 3, 2026
అలసంద మొక్కల ఆకులను పురుగులు తినేస్తున్నాయా?

అలసంద పంటను ఆకు తినే పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి. ఈ పురుగులు ఆకులను తినేయడం వల్ల మొక్కల ఎదుగుదల లోపిస్తుంది. వీటి తీవ్రత పెరిగితే దిగుబడిపై కూడా ప్రభావం పడుతుంది. ఈ పురుగుల నివారణకు లీటరు నీటికి 5ml వేప గింజల కషాయాన్ని లేదా లీటరు నీటికి 3ml అజాడిరక్టిన్ (3000 PPM) చొప్పున కలిపి పంటపై పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.


