News October 3, 2025
సారీ మమ్మీ బతకాలని లేదు: ఇట్లు నీ పింకీ

TG: పెదనాన్న వేధింపులు తాళలేక మేడ్చల్(D) కొంపల్లిలో అంజలి(17) ఆత్మహత్య చేసుకున్నారు. ‘అమ్మా నన్ను క్షమించు. బతకాలని లేదు. నాన్న చనిపోయాక పెదనాన్న ప్రతివారం గొడవకు వస్తున్నాడు. నాకు అవమానంగా ఉంది. మనల్ని ప్రశాంతంగా బతకనివ్వడు. ఫైనాన్స్ ఇప్పించి తానే నాన్నను చంపానని నాతో అన్నాడు. పెదనాన్నకు కచ్చితంగా శిక్ష పడాలి. సారీ మమ్మీ. ఇట్లు నీ పింకీ’ అని ఆమె సూసైడ్ నోట్ రాశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News October 3, 2025
అమరావతిలో పెట్టుబడులకు మలేషియా సంస్థల ఆసక్తి

AP: మలేషియా సెలంగోర్ EX CO మెంబర్ పప్పారాయుడు, క్లాంగ్ ఎంపీ గణబతిరావ్, మలేషియా-ఆంధ్ర బిజినెస్ ఛాంబర్ ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. అమరావతిని రెండున్నరేళ్లలో పూర్తిచేస్తామని తెలిపారు. ప్రపంచంలోనే టాప్ 5 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దడమే CBN లక్ష్యమని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ₹10వేల కోట్లతో పలు ప్రాజెక్టుల ప్రతిపాదనల్ని ప్రతినిధులందించారు. అంతకు ముందు వారు అమరావతిలో పర్యటించారు.
News October 3, 2025
CSIR-IICTలో ఉద్యోగాలు

CSIR-IICT 7 సైంటిస్టు పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు అక్టోబర్ 30వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32 ఏళ్లు. పోస్టును బట్టి పీహెచ్‌డీ, ఎంటెక్/ఎంఈ, ఎంఫిల్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.iict.res.in/CAREERS
News October 3, 2025
విజయ్ వాహనాన్ని ఎందుకు సీజ్ చేయలేదు: మద్రాస్ HC

తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటన దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. టీవీకే చీఫ్ విజయ్ వాహనాన్ని ఎందుకు సీజ్ చేయలేదని పోలీసులను ప్రశ్నించింది. ఘటన తర్వాత ఆ పార్టీ నేతలంతా ఎక్కడికి వెళ్లారని, బాధితులను ఎందుకు పట్టించుకోలేదని నిలదీసింది. ఘటనపై సిట్ దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించింది. టీవీకే నేతల ముందస్తు బెయిల్ తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది.